World Snake Day 2022: పాములు మనుషులకు ఎందుకు హాని కలిగిస్తున్నాయో తెలుసా.. ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ
World Snake Day 2022: ప్రపంచవ్యాప్తంగా అన్ని దినోత్సవాలను జరుపుకుంటారు. అంతేకాకుండా వాటిని పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ రోజు కూడా ఓ పవిత్రమైన రోజే అదేంటో తెలుసా.. మన చుట్టు ఉండే పాముల దినోత్సవం. అయితే ప్రతిత ఏడాది జూలై 16 ప్రపంచ పాము దినోత్సవాన్ని జరుపుకుంటారు.
World Snake Day 2022: ప్రపంచవ్యాప్తంగా అన్ని దినోత్సవాలను జరుపుకుంటారు. అంతేకాకుండా వాటిని పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ రోజు కూడా ఓ పవిత్రమైన రోజే అదేంటో తెలుసా.. మన చుట్టు ఉండే పాముల దినోత్సవం. అయితే ప్రతిత ఏడాది జూలై 16 ప్రపంచ పాము దినోత్సవాన్ని జరుపుకుంటారు. పాములపై అవగాహన కల్పించేందుకు.. ముఖ్యంగా వాటిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోయేందుకు ఈ దినాన్ని జరుపుకుంటారు. నిజ జీవితంలో ప్రతి ప్రాణి ఒక జీవే.. వాటిలో పాము కూడా ఒక జీవి కావుణ ఎలాంటి సందర్భంలోనై పాములకు హాని కలిగించకూడదని పలువురు రాజకీయ, పర్యావరణ వేత్తల పేర్కొన్నారు. అయితే వీటిని చాలా దేశాల్లో చెడు శకునంగా భావిస్తారు. మరికొన్ని దేశాలు(భారత్‌లో) దేవుళ్లుగా కూడా పూజిస్తున్నారు. అయితే వీటికి హాని కలిగిస్తే.. ఇవి కూడా హాని కలిగిస్తాయి. కావున వీటికి హాని కలిగించకూడదు.
ప్రపంచ వ్యాప్తంగా 3,000 కంటే ఎక్కువ పాములు జాతులు:
భూమిపై 3,000 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయని చాలా మంది శాస్త్రవేత్తలకు తెలియకపోవచ్చు..! అంటార్కిటికా, ఐస్‌లాండ్, ఐర్లాండ్, గ్రీన్‌ల్యాండ్, న్యూజిలాండ్ మినహా ప్రతిచోటా పాములు విచ్చల విడిగా కనిపిస్తాయి. ఈ జాతులన్నింటిలో దాదాపు 600 జాతులు విషపూరితమైనవని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 200 జాతులు మాత్రమే 100 శాతం విషపూరితమైనవని.. ఇవి మానవులను చంపగల సామర్థ్యం కలిగున్నాయని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో సుమారు 300 పాము జాతులున్నాయి. వాటిలో 60 కంటే ఎక్కువ విషపూరితమైతే.. మరి కొన్ని 40 కంటే ఎక్కువ తేలికపాటి విషపూరితమైనవని నిపుణులు పేర్కొన్నారు. అయితే భారత్‌లో ఉండే పాములలో ముఖ్యమైన నాలుగు జాతులు కొలుబ్రిడే, ఎలాపిడే, హైడ్రోఫిడేగా పరిగణిస్తారు. విపెరిడే, రస్సెల్స్ వైపర్స్ (డబోయా రస్సెల్లి), కరైట్, కోబ్రా (నాజా జాతులు) భారతదేశంలో ఎక్కువగా కాటువేసే జాతులుగా పేర్కొన్నారు.
ప్రపంచంలోని ప్రతి మూలలో ఓ పాము ఉంటుంది:
ప్రపంచంలోనే పురాతనమైన జీవులలో పాము ఓ జీవీగా పురాణాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన అంశాలను దాదాపు ప్రతి నాగరికతలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3,458 రకాల పాములు ఉన్నాయని పలు నివేధికలు తెలుపుతున్నాయి. కెనడా లాంటి మంచుతో కప్పబడిన ప్రాంతం నుంచి హిమాలయ మైదానాల వరకు ఏదో ఒక ప్రాంతంలో పాములను కనుగొంటున్నారు. అయితే చాలా మంది వేటగాళ్ళు పాములకు హాని కలిగించడం వల్ల కొన్ని చనిపోతున్నాయి. అంతేకాకుండా మరికొన్ని గాయపడుతున్నాయి. అయితే వీటికి హాని చేయడం వల్ల భూమిపై జాతులు తరిగిపోమయో అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున వీటికి హాని చేయకుండా వీటిని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలని పలు దేశాల ప్రభుత్వాలు పేర్కొన్నాయి. వీటి వల్ల పర్యావరణం కూడా మార్పులకు లోనవ్వకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో పాము కాటు కారణంగా మరణించిన వారి సంఖ్య:
WHO నివేదిక ప్రకారం.. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు భారతదేశంలో పాముకాటు మరణాలు 12 లక్షలని పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని పలు నివేదికలు తెలిపాయి. ప్రతి సంవత్సరం సగటున 58,000 మరణాలు సంభవిస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.
వానా కాలంలో ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు:
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పాము కుట్టిన తర్వాత ఇంటి చికిత్స కారణంగా 70% మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. భారతదేశంలోని 8 రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా 70% కేసులు పాము కాటు కేసులు నమమోదవుతున్నాయని నివేదికలు వెల్లడించాయి.
Also Read: Godavari Floods LIVE: భద్రాచలం సేఫేనా? మరో నాలుగు గంటలు గడిస్తేనే.. పోలవరంలోనూ హై టెన్షన్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.