Samudrudu Movie Pre Release Event: ‘సముద్రుడు’ మూవీ సంచలన నిర్ణయం.. వసూళ్లలో 20 శాతం మత్స్యకారుల కోసం ఖర్చు చేస్తాం..
Samudrudu Movie Pre Release Event: రమాకాంత్, అవంతిక, భానుశ్రీ నాయికా, నాయకులుగా నటించిన చిత్రం ‘సముద్రుడు’. నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. బధావత్ కిషన్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
Samudrudu Movie Pre Release Event: తెలుగులో ఈ మధ్యకాలంలో మత్స్య కారుల జీవితాల నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో వచ్చిన ఉప్పెన, వాల్తేరు వీరయ్య, తాజాగా దేవర సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ కోవలో మరో మత్స్య కార నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సముద్రుడు’. రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో, హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో 20 శాతం మత్స్య కారుల అభివృద్ధి కోసం ఇస్తామంటూ చెప్పడం విశేషం. ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించారు. సుమన్ యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాలో ఉండే కామెడీ కథానుగుణంగా ఆడియన్స్ అలరిస్తాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి. సముద్ర, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులు, సుమన్ , కో ప్రొడ్యూసర్స్ జ్ఞానేశ్వర్, సొములు, చిత్ర నిర్మాత కీర్తన తదితరులు పాల్గొన్నారు.
"మత్యకారుల జీవితాలను బేస్ చేసుకొని తెరకెక్కించిన చిత్రమంటూ మూవీ చెప్పుకొచ్చింది. సముద్రమే వారి జీవనాధారం, అలాంటి సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారు ఎలాంటి పోరాటం చేసారు. వారి జీవన పోరాటం, వారి మనో వేదన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ : సముద్రుడు టైటిల్ దర్శకుడు నగేష్ నన్ను చూసి పెట్టడం జరిగిందననారు. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న ఎప్పుడో చెప్పారు. ఆ మాటని నిజం చేస్తూ ఈ రోజు రమాకాంత్ హీరోగా సినిమా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు నగేష్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఆడియన్స్ సక్సెస్ రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.
టి. ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : మొదటి సినిమానే మైథాలజికల్ సినిమా తీసిన డైరెక్టర్ నగేష్. ఇది అతనికి 12వ సినిమా. అదేవిధంగా తన స్నేహితుడు దర్శకుడు సముద్ర తనకే సపోర్టుగా ఉండడం మంచి విషయం. ఈ సినిమా తప్పుకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేసారు.
నటుడు శ్రవణ్ మాట్లాడుతూ : సముద్రుడు సినిమా నా గుండెలకు హత్తుకున్న సినిమా. ఎంతో కష్టపడి సినిమాని తీసాం. సముద్రం పైన జాలర్ల జీవితాన్ని చూపిస్తూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్న మంచి సినిమా. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది.
నిర్మాత కీర్తన మాట్లాడుతూ : మా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాలు. దర్శకుడు వి. సముద్రకి, టి. ప్రసన్న కుమార్ కి హీరో సుమన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు.
హీరో సుమన్ గారు మాట్లాడుతూ : మీకు నేను హీరో సుమన్ గా తెలుసు కానీ నా జీవితాన్ని తెలిసిన వ్యక్తి మా అన్న రామరాజు. చెన్నైలో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నటుడినయ్యాను. ఫస్ట్ చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇండస్ట్రీ నుంచి సెటిల్ అయిన వ్యక్తిని నేనే. ఎన్నో కష్టాలు అధిగమించి హైదరాబాదులో తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాను. అదేవిధంగా నగేష్ ఫస్ట్ సినిమా పౌరాణిక సినిమా. అన్నమయ్య, శ్రీ రామదాసు తర్వాత చేసిన పాత్రలే ఎందుకు అని దేవుడు పాత్రలు చేయడం మానేశాను. కానీ నగేష్ చెప్పిన కథ నచ్చి ‘శ్రీ సత్యనారాయణ స్వామి’ సినిమాలో సత్యనారాయణ స్వామి పాత్ర లో నటించాను. అంతేకాదు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా త్రిమూర్తులుగా నాతో వేషం వేయించారు. నేను చేసిన 750 సినిమాల్లో చెప్పుకోదగ్గ మంచి సినిమాల్లో ఖచ్చితంగా శ్రీ సత్యనారాయణ స్వామి సినిమా ఉంటుందన్నారు. అలాంటి మంచి కథను తీసుకొచ్చిన వ్యక్తి దర్శకుడు నగేష్. సముద్రుడు సినిమా జాలర్ల జీవితాలపై తెరకెక్కిన పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు.
హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ : సముద్రుడు సినిమాలో నేను టీచర్ పాత్రలో నటించాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు నగేష్ కి, హీరో రమాకాంత్ సహా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
హీరో రమాకాంత్ మాట్లాడుతూ : మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలు అందరికీ శిరసు వంచి దండం పెడుతున్నాను. దర్శకుడు నగేష్ ఈ కథ కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్ మరియు ఆర్టిస్ట్ సొంత సినిమాగా భావించి కష్టపడి పనిచేశారని కొనియాడారు.
దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ : మా సముద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతులు. దర్శకుడు వి. సముద్ర కి టి. ప్రసన్నకుమార్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా జాలర్ల జీవితాన్ని చూపించే డాక్యుమెంటరీ ఫిలిం లా కాకుండా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన ఒక మంచి సినిమా అన్నారు. సముద్రం దగ్గర ఉండే జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు వాళ్లకు వచ్చే సమస్యల్ని ఈ చిత్రంలో చూపించడం జరిగిందన్నారు. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమా నచ్చుతుందన్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter