Raj Dasireddy:ఏ ఇండస్ట్రీలోనైనా పాత నీరు పోయి కొత్త నీరు రావడం కామన్. ఈ కోవలో తెలుగు సహా అన్ని భాషల ఎప్పటికపుడు కొత్త నటీనటులు రావడం కామన్. ఈ కోవలో మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు’ మూవీతో కథానాయకుడిగా పరిచయమైన ‘రాజ్ దాస్ రెడ్డి’.. త్వరలో ఓ  భారీ యాక్షన్ ఎంటర్టేనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇందు కోసం తనను తాను మౌల్డ్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా యాక్షన్ సన్నివేశాల్లో రాణించేందుకు అమెరికాలో ట్రైయిన్ అవుతున్నారు. తన నెక్ట్స్ మూవీ కోసం ఇప్పటికే అమెరికా, ఊటీ, హైదరాబాద్, విశాఖ పట్నం ప్రదేశాల్లో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ చిత్రం కోసం దాసిరెడ్డి అమెరికాలోప్రత్యేకంగా శిక్షణ కూడా  తీసుకుంటున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు’ సినిమా తర్వాత దాసిరెడ్డికి తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చినా.. సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదే టైమ్ లో హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో అక్కడికి వెళ్లాడు. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి మరింత టైమ్ పట్టే అవకాశం ఉండటంతో రీసెంట్ గా ఉన్న కథలో భారీ యాక్షన్ ఎంటర్టేనర్ కు ఓకే చెప్పాడు రాజ్ దాసిరెడ్డి.


అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్సన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించనున్నారు. ఇక మారుతి వెండితెరకు పరిచయం చేసిన చాలా మంది నటీనటులు తెలుగు సినీ ఇండస్ట్రీలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అదే రీతిలో రాజ్ దాసిరెడ్డి కూడా తెలుగులో మంచి హీరోగా రాణించాలని కోరుకుందాం.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి