Parakramam Trailer: గ్రాండ్ గా బండి సరోజ్ కుమార్ `పరాక్రమం` ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. ఈ నెల 22న విడుదల..
Parakramam Trailer Release Event: బండి సరోజ్ కుమార్ హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేసిన చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసారు. ఇప్పటికే సెన్సార్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
Parakramam Trailer Release Event: బండి సరోజ్ కుమార్ హీరోగా నటించడమే కాదు.. డైరెక్ట్ చేస్తూ మెగాఫోన్ పట్టుకున్న చిత్రం ‘పరాక్రమం’ . గతంలో తన యూట్యూబ్ వీడియోలతో పేరు తెచ్చుకున్న ఇతను తానే స్వయంగా రంగంలోకి దిగి ‘పరాక్రమం’ మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా జరిగిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ..
‘పరాక్రమం' ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన నా స్నేహితుడు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, హీరో సందీప్ కిషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. ప్రతి కామన్ మ్యాన్ కు కనెక్ట్ అయ్యే సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్టర్ లో మీకు సత్తి బాబు, లోవరాజు అనే రెండు క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. లోవరాజు తండ్రి సత్తిబాబు. ప్రతి ఒక్కరిలో సత్తి బాబు ఉంటాడు లోవరాజు ఉంటాడు. సత్తిబాబు నుంచి లోవరాజుకు జరిగే ట్రాన్సఫర్మేషన్ ఈ సినిమా అని చెప్పారు. కామన్ మ్యాన్ లా బతకడం కష్టం. మీ లైఫ్ లో హీరోలు ఉంటారు విలన్స్ ఉంటారు. ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని మీరు స్క్రీన్ పై చూసుకున్నట్లు పరాక్రమం సినిమా ఉంటుందని చెబుతున్నారు. నేను అభిమానించే చిరంజీవి బర్త్ డే రోజున 'పరాక్రమం' రిలీజ్ కావడం ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి అంటే శిఖరం. ఆయన హీరోగా నాలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ -
బండి సరోజ్ కుమార్ చాలా జెన్యూన్ ఫిల్మ్ మేకర్. ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ఆయన సినిమా ఈవెంట్స్ కూడా రొటీన్ గా ఉండవు. నేను చెన్నైలో పోర్కాలం అనే సినిమా చూసి ఎవరీ దర్శకుడు అనుకుని ఆశ్చర్యపోయాను. ఆయన బండి సరోజ్ కుమార్. ఆ తర్వాత ఆయనను ఫేస్ బుక్ లో వెతికి మరీ టచ్ లోకి వెళ్లాను. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ -
బండి సరోజ్ కుమార్ డైరెక్టర్ గా నటుడిగా నాకు ఇష్టం. ఆయన టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్. బండి సరోజ్ కుమార్ మాంగల్యం వంటి సినిమాలు చూసి నేనూ డబ్బులు పంపాను. పరాక్రమం సినిమా మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డేకు ఆగస్టు 22న విడుదల అవుతోంది. ఈ సినిమాకు నా వంతు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు. అంతేకాదు పరాక్రమం వంటి చిత్రాలు ఆదరణ పొందితేనే ఇండస్ట్రీ పది కాలాల పాటు బాగుంటుందన్నారు. థియేటర్స్ సర్వైవ్ అవుతాయి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పరాక్రమం చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నటీనటులు : బండి సరోజ్ కుమార్, శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శశాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ తదితరులు
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter