నటీనటులు: రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, రామకృష్ణ, ఆచారి, హర్ష, సతీష్, సరళ తదితరులు
ఎడిటర్ - బాలకృష్ణ బోయ
మ్యూజిక్ - శ్రీ వెంకట్
సినిమాటోగ్రఫీ - మల్హర్ భట్ జోషి
బ్యానర్ - భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
కథ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం - భాస్కర్ యాదవ్ దాసరి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి లీడ్ రూల్స్ లో యాక్ట్ చేసిన మూవీ ‘చిట్టి పొట్టి’. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తూ డైరెక్ట చేసారు. అన్నా, చెల్లెలు సెంటిమెంట్ తో... ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం ఈ రోజే ఆడియన్స్ ముందుకు  వచ్చింది. మరి సిస్టర్  సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రి్వయూలో చూద్దాం..


కథ విషయానికొస్తే..
కిట్టు(రామ్ మిట్టకంటి) నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ కావాలనుకుంటారు. అందుకోసం  ప్రయత్నిస్తూ ఉంటాడు. అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్(కస్వి) కూడా ఉంటుంది. ఆమె యూఎస్ లో జాబ్  చేస్తూ ఉంటుంది. కిట్టుకి చిట్టి(పవిత్ర) అనే సిస్టర్ ఉంటుంది. ఆమె అంటే తనకి ప్రాణం. చెల్లెలు జోలికి ఎవరైనా వచ్చినా... ఆమెను ఎవరైనా ఏడిపించినా... వాళ్లపై ఉరుము లేని పిడుగులా పడిపోతుంటాడు. ఈ  ఈ క్రమంలో ఆమె ఓ ఆకతాయి బ్యాచ్ కారణంగా కిట్టు చెల్లెలు ఫొటోలనుడీప్ ఫేక్ మార్ఫింగ్ గురవుతుంది. ఆ అవమానానికి తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తుంది.  ఇదే సమయంలో తన చెల్లిని చేసుకోబోయే వ్యక్తి విక్కీ కూడా ఆమెపై అనుమానాస్పదంగా చూస్తుంటాడు. అలాగే తన తండ్రి కుటుంబం చాలా మంది బంధువులకు దూరంగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఓ అన్నగా కిట్టు తన చెల్లిని ఎలా కాపాడుకున్నాడు. చివరకు ఆమెకు పెళ్లి చేశాడా.. ? ఈ క్రమంలో ఎలాంటి దుష్ట శక్తులను ఎదుర్కొన్నాడు. చిన్న మనస్పర్థల కారణంగా దూరంగా వెళ్లిపోయిన మూడు తరాల వారిని ఎలా ఒక చోటుకు చేర్చారు? చివరకు తను అనుకున్న పోలీసు పోస్టింగ్ ను సంపాదించి ? తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడా లేదా చిట్టి పొట్టి స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


తెలుగులో అన్నా చెల్లెల్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలొచ్చాయి. అలనాటి ‘రక్త సంబంధం’ మొదలు నిన్న మొన్నటి గోరింటాకు వరకు ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను మెప్పించనవే. అలాంటి సిస్టర్ సెంటి మెంట్ సినిమాకి... ఇప్పటి జనరేషన్ లో  టెక్నాలజీ వల్ల జరుగుతున్న డీఫ్ ఫేక్ మార్ఫింగ్ వల్ల తన చెల్లులు ఎలా అవమానానికి గురైంది... దాన్నుంచి ఎలా ఆమెను బటయపడేశారనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం దర్శకుడు విజయం సాధించాడు. అన్నా చెల్లెలు సెంటిమెంట్ కు డీప్ ఫేక్ టెక్నాలజీ మంచిగానే కనెక్ట్ చేసాడు. అలాగే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉద్యోగ రీత్యా ఉండేవాల్లు  బంధాలు, బంధుత్వాలు ఇవేమీ తెలియవు. పక్కపక్కనే జీవిస్తున్నా... మన స్నేహితులెవరో, మన చుట్టాలెవరో కూడా మనం గుర్తించలేము.


అలాంటి తరుణంలో మన బంధువుల ఎక్కడెక్కడ ఉన్నారనే విషయం పెద్దవాళ్ల ద్వారా తెలుసుకొని ఓ సారి కలుసుకోవడం అనే పాయింట్ మనకు బ్రహ్మోత్సవం సినిమా గుర్తుకు వస్తుంది. మొత్తంగా తన చెల్లెలు పెళ్లి కోసం తన బంధు గణాన్ని అంతా వెతికి తీసుకొచ్చే క్రమం బాగుంది. అటు డీప్ ఫేక్ బ్యాచ్ పట్టుకునే క్రమం.. ఈ క్రమంలో తన పోలీస్ ఉద్యోగం ఎలా సంపాదించుకోవడం వంటి సీన్స్ బాగున్నాయి. దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్  మీద లాగించేసాడు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా ఉంది. సెకెండాఫ్ అంతా బంధువులు... వారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లే సీన్స్ తో కాస్త ఎమోషనల్ గా తెరకెక్కంచాడు. క్షణికావేశంలో చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడి దూరమైన అన్నా చెల్లెళ్లు,వదిన, ఆడబిడ్డలు, బావా బావమర్దులు,   ఇలా అందరిని ఓ చోటుకు చేర్చడానికి రాసుకున్న ఏమోషనల్ స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరు  కనెక్ట్ అవుతారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


డైరెక్టర్ రాసుకున్న చెల్లెలు సెంటిమెంట్ పాయింట్.. దానికి  ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అన్నీ బాగా కనెక్ట్ అవుతాయి. ఈ ఆధునిక ప్రపంచంలో జరిగే వింత పోకడలను ఇందులో ప్రస్తావించడం గమనార్హం.  అలాగే ఎప్పుడో విడిపోయిన బంధుగణాన్ని అంతా ఓ చోటుకు చేర్చడం లాంటి ఎమోషన్ సీన్స్ బాగా చిత్రీకరించారు. ఈ సినిమాకి తనే ప్రొడ్యూసర్  కాబట్టి... ఎక్కడా రాజీ పడలేదు.  నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. పాటలన్నీఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల పిక్చరైజేషన్ విజువల్ గా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా వుండాల్సింది. ఫైనల్ గా... చిట్టి పొట్టి... సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా... ప్రేక్షకులను మెప్పిస్తుంది.


నటీనటుల విషయానికొస్తే..
రామ్ మిట్టకంటి.. అగ్రిసివ్ గా వుండే ఓ అన్నగా... బంధాలు, అనుబంధాలకు వాల్యూ
ఇచ్చే ఓ  ఫ్యామిలీలో పెద్ద కుమారుడిగా... తనకు ఇష్టమైన జాబ్ కోసం కష్టపడే ఓ నిబద్ధత కలిగిన యువకుడిగా మెప్పించాడు. మరోవైపు . లవర్ బోయ్ గా ఇలా అన్ని యాంగిల్స్ లోనూ మెప్పించాడు. యాక్షన్ సీన్స్ ను చాలా బాగా చేశాడు. సెంటి మెంట్ ను కూడా బాగా పండించాడు. అతని చెల్లిగా నటించిన పవిత్ర నటన ఆకట్టుకునే విధంగా . ఇద్దరూ సొంత అన్నా చెళ్లెల్లా అనే విధంగా నటించేశారు. అంతలా వారిద్దరి మధ్య సెంటిమెంట్ పండింది. హీరోయిన్ కస్వి పాత్ర పర్వాలేదు. మిగిలిన నటీనటుల తమ  పరిధి మేరకు సినిమాలో నటించారు.


రేటింగ్: 2.5/5


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి