Funny Video: భారతదేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్ల వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. ఈ వీడియోలలో వధూవరులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆయా పెళ్లిళ్లకు సంబంధించిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫన్నీ వీడియోనే ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. పెళ్లిలో వరుడి ఊరేగింపు ఉంటుంది. ఇందులో పెళ్లి కుమారుడ్ని గుర్రంపై సంప్రదాయం ప్రకారం ఊరేగిస్తారు. ఆ వీడియోలో అలాంటి సంఘటనే జరుగుతోంది. సంప్రదాయం ప్రకారం.. గుర్రంపై ఉన్న పెళ్లి కుమారుడు చేయాల్సిన కార్యాలు అన్ని నెరవేరుస్తున్న క్రమంలో.. అక్కడే ఉన్న ఓ అకతాయి సడెన్ గా దీపావళి బాంబు పేల్చాడు. 



దీంతో ఆ బాంబు పేలుడు ధాటికి గుర్రం బెదిరింది. దీంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. అయితే దానిపై ఉన్న పెళ్లి కొడుకును కూడా తనతో పాటే గుర్రం తీసుకెళ్లింది. అయితే ఆ గుర్రాన్ని నియంత్రించే వ్యక్తి చూసుకోని నేపథ్యంలో ఆ గుర్రం పరుగు తీసింది. దాన్ని నియంత్రించేందుకు గుర్రానికి సంబంధించిన వ్యక్తి కూడా పరుగులు తీశాడు. ఈ ఫన్నీ వీడియోకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆదరణ లభిస్తోంది. దీనిపై పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 


ALso Read: Mobile Theft Video: బాప్ రే! ఎంత తెలివిగా మొబైల్ దొంగతనం చేసిందో మీరే చూడండి!


ALso Read: Nude Thief Caught On Camera: వీడో వెరైటీ దొంగ.. బట్టలిప్పి నగదు చోరీ.. సీసీ కెమెరా దృశ్యాలు వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.