Nude Thief Caught On Camera: వీడో వెరైటీ దొంగ.. బట్టలిప్పి నగదు చోరీ.. సీసీ కెమెరా దృశ్యాలు వైరల్

Thief Caught On Camera: వినోదం సినిమా చూశారు కదా.. ఆ సినిమాలో ఇంటి ఓనర్ పాత్ర పోషించిన తనికెళ్ల భరణి బారి నుంచి తప్పించుకోవడానికి హీరో శ్రీకాంత్ బృందం వేసిన ఎత్తుగడ గుర్తుండే ఉంటుంది. తనికెళ్ల భరణి నగ్నంగా మారేలా చేసి అతడిని ఆట పట్టించిన సీన్ ఎన్నిసార్లు చూసినా కడుపుబ్బా నవ్విస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 03:40 PM IST
  • కెమెరాకు చిక్కిన వింత దొంగ
  • షట్టర్ తాళాలు విరగ్గొట్టి దుకాణంల ో చోరీ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Nude Thief Caught On Camera: వీడో వెరైటీ దొంగ.. బట్టలిప్పి నగదు చోరీ.. సీసీ కెమెరా దృశ్యాలు వైరల్

Thief Caught On Camera: వినోదం సినిమా చూశారు కదా.. ఆ సినిమాలో ఇంటి ఓనర్ పాత్ర పోషించిన తనికెళ్ల భరణి బారి నుంచి తప్పించుకోవడానికి హీరో శ్రీకాంత్ బృందం వేసిన ఎత్తుగడ గుర్తుండే ఉంటుంది. తనికెళ్ల భరణి నగ్నంగా మారేలా చేసి అతడిని ఆట పట్టించిన సీన్ ఎన్నిసార్లు చూసినా కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటన చూస్తే.. ఈ సీన్‌లో కనిపించే వ్యక్తిని కూడా ఎవరైనా మిస్‌లీడ్ చేసి చోరీకి పంపించారా అనే సందేహం రాకమానదు. 

ఇప్పటివరకు మనం చూడని వింత దొంగ ఓ సిసి కెమెరాకు చిక్కాడు. సనత్ నగర్‌లోని ఓ మెడికల్ షాప్‌లో చోరీకి పాల్పడ్డాడు. షాప్ షెటర్ వంచి షాపులో 2 లక్షల 85 వేల రూపాయలు ఎత్తుకెళ్లాడు. ఇందులో కొత్త వింత ఏముంది తరచుగా వింటున్నదే కదా అని అనుకుంటున్నారా ? అయితే ఆ పాత కేసులన్నీ వేరు.. ఈ కొత్త కేసు వేరు. రొటీన్‌కి భిన్నంగా ఇదొక వెరైటీ చోరీ. సిసి కెమెరాలో రికార్డ్ అయిన దృశాలే అందుకు నిదర్శనం. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు చూసి పోలీసులే నివ్వెరపోయారు. ఏం జరుగుతుందో, ఆ దొంగ అలా వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక కాసేపు తలలు పట్టుకున్నారు.

ఈ వెరైటీ చోరీ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సనత్ నగర్ బస్టాప్ వద్ద ఉన్న బాలాజీ ఫార్మాలోకి అర్ధరాత్రి ఓ దొంగ ప్రవేశించాడు. షట్టర్ తాళాలు విరగ్గొట్టి లోపలికి 'నగ్నంగా' ప్రవేశించిన దొంగ.. అందులోనే రెండు గంటలపాటు ఉండి తెల్లవారుజామున బయటపడ్డాడు. మెడికల్ షాపు డ్రాలో ఉన్న రెండు లక్షల ఎనభై ఐదు వేలు రూపాయలు నగదు తీసుకుని బయటికొచ్చి తిరిగి దుస్తులు వేసుకుని దర్జాగా నడుకుంటూ వెళ్లిపోయాడు. 

ఈ దృశ్యాలన్నీ దుకాణం బయట, లోపల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఉదయాన్నే చోరీ జరిగినట్లు గుర్తించిన దుకాణం యజమాని వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు. చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు ప్రస్తుతం ఈ వెరైటీ దొంగను (Funny theft case) పట్టుకునే పనిలో బిజీ అయ్యారు.

Also read : Mobile Theft Video: బాప్ రే! ఎంత తెలివిగా మొబైల్ దొంగతనం చేసిందో మీరే చూడండి!

Also read : Viral Video: భయం లేకుండా బ్లాక్ కోబ్రాకు నీరు తాగించిన వ్యక్తి..నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో.!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News