Prabhutva Junior Kalasala OTT Streaming: ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జోడిగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'.  బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను  నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ మదిని దోచుకుంది.  ఇప్పుడు ఈ సినిమా  ఓ టి టి ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..  "మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రాన్ని టాకీస్ లో చూసి సరికొత్త అనుభూతి పొందారు. థియేటర్స్ లో ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.ఇక వెండితెరప ఈ సినిమాను చూడని వారికోసం ఒక శుభవార్త. మా చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.


ప్రతి మనిషి జీవితంలో తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి అద్బుతమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాలో అద్బుతంగా చూపించారు దర్శకులు.  ఇంటర్మీడియట్ రోజులు.. ఫస్ట్ లవ్.. విరహ వేదనలు..  ఇలా అన్ని అంశాలతో యూత్ ను ఎమోషనల్ గా  కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్నిఈ సినిమాలో  చూపించారు. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు.


థియేటర్‌లో యువతని ఆకర్షించిన ఈ చిత్రం  ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కుటుంబ  ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెబుతున్నారు. ఫ్యామిలీ అందరు కలిసి మంచి ఎమోషనల్ కుటుంబ  కథ చిత్రం చూడాలి అనుకుంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల సరైన సినిమా అని దర్శక నిర్మాతలు తెలిపారు.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.