చిత్రం : హైడ్ న్ సిక్ (Hide N Seek)
నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులు
సంగీత దర్శకుడు: లిజో కె జోష్
సినిమాటోగ్రాఫర్: చిన్న రామ్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
బ్యానర్: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారి
దర్శకత్వం: బసిరెడ్డి రానా
విడుదల: 20-09-2024


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరింత, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఈయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’.
సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం థియేటర్లో రిలీజైన  ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం.


కథ:
కర్నూల్ నేపథ్యంలో జరిగే ఈ మూవీలో శివ(విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తన అక్కతో కలిసి జీవిస్తూ ఉంటాడు. తన తండ్రి, బావ ఆర్మీలో పనిచేసి వీర మరణం పొందుతారు. దీంతో తన తమ్ముడు ఆర్మీకి వెళ్లడం శివ అక్కకు అసలు ఇష్టం ఉండదు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష(రియా సచ్దేవ్)తో శివ లవ్ లో పడతాడు.  వీరి పెళ్లికి వర్ష తండ్రి కేకే కూడా ఒప్పుకుంటాడు. అతను కేకే మెంటల్ హెల్త్ ఆసుపత్రి  స్థాపించి రోగులకు నయం చేస్తుంటాడు. అయితే సిటీలో ఒక డెలివరీ బాయ్ ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్ తో కొట్టి చంపేస్తాడు. అది యాక్సిడెంట్ కేసు అని కేసును క్లోజ్ చేస్తారు .అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఎవరో పోలీస్ స్టేషన్ కు ఎవరో లెటర్ పంపిస్తారు. ఒకనొక సందర్భంతలో శివ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. . శివను ఎందుకు టార్గెట్ చేశారు. ఈ వరుస మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి. దానికి మోటివ్ ఏంటి.. ?కేకేకు ఈ మర్డర్లకు సంబంధం ఉందా? పోలీసు ఆఫీసర్ వైష్ణవి ఈ కేసును ఏ పరిష్కరించింది. ఈ కేసులో శివ నిర్ధోషా కాదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 


కథనం, విశ్లేషణ:


తెలుగులో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ కు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఇలాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే ప్రధానం. దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్  గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.  ఏదో నాలుగు ఫైట్లు ఐదు పాటలు ఉండే రెగ్యులర్ మూవీ కాదు హైడ్ న్ సిక్. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు మంచి సస్పెన్స్ మెయింటెన్ చేసాడు. ఆ మధ్య బ్లూవేల్ గేమ్ అని బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఒక గేమ్ పిల్లలనే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి  లైఫ్ లతో  ఎలా ఆడుకుంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. మొదటి మర్డర్ నుంచి విరామం  వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా చక్కగా తెరపై ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. వరుస మర్డర్లు ఎందుకు జరగుతున్నాయి. దాని వెనకాల ఉన్న మోటివ్ ఏమిటన్నది ఈ సినిమాలో అసలు ట్విస్ట్.  కథలో భాగంగా  సినిమాలో క్యారెక్టర్స్ డిజైన్ చేయడం బాగుంది.  పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం ఆకట్టుకుంది.  మొత్తంగా ప్రీ క్లైమాక్స్ సీన్స్.. ఎక్కడ ఎలాంటి రక్తపాతం లేకుండా స్మూత్ గా తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా మెప్పిస్తుంది. సినిమాలో విపరీతమైన హింస లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఆర్ఆర్ ఈ సినిమాకు ప్రాణంలా నిలిచింది.ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువులు బాగున్నాయి.


నటీనటుల విషయానికొస్తే..
దాదాపు అంతా కొత్తవాళ్లతో తెరకెక్కించిన హైడ్ న్ సీక్ సినిమాలో హీరో తన పాత్రలో అమాయకంగా ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.



పంచ్ లైన్.. హైడ్ న్ సీక్.. ఆకట్టుకునే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్..


రేటింగ్.. 2.75/5


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.