Iddaru Release Date:యాక్షన్ కింగ్ అర్జున్, జె డి చక్రవర్తి కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరు’. చాలా కాలం తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడలో 150 పైగా చిత్రాల్లో యాక్షన్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా సత్తా చూపిస్తున్నారు అర్జున్. తాజాగా ఈయన నటించిన ‘ఇద్దరు’ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  అంతేకాదు ఈ సినిమాకు రిలీజ్ డేట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఛీఫ్ గెస్ట్ లుకా ప్రతాని రామకృష్ణ గౌడ్, టి. ప్రసన్న కుమార్, జెవిఆర్ పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్  మాట్లాడుతూ : ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి చేస్తోన్న మా అన్న టి. ప్రసన్నకుమార్ కి, జె.వి.ఆర్ కి ప్రత్యేకంగా  థాంక్స్ చెబుతున్నాను. సమీర్ నాకు ఎంతో మంచి ఆప్తులు. నేను డైరెక్ట్ చేసిన సినిమాకి ఆయన కో డైరెక్టర్ గా పని చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానన్నారు.


టి. ప్రసన్న కుమార్  మాట్లాడుతూ : చిన్న,  పెద్ద సినిమా చూడకుండా ఈ చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు.  జె డి చక్రవర్తి సాంగ్ కి డాన్స్ చేసింది మా సినిమాకే అది మాల్గడి సాంగ్ పెద్ద హిట్ అయింది. జెడి చక్రవర్తి, అర్జున్  ఇద్దరూ టెక్నికల్ వాల్యూస్ తెలిసిన వాళ్లే. సమీర్, జెడి చక్రవర్తి పనిచేస్తూ ఆ టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని తీశారని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా  పెద్ద సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


నిర్మాత డి ఎస్ రెడ్డి గారు మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి విచ్చేసిన టి ప్రసన్నకుమార్ కి, ప్రతాని రామకృష్ణ గౌడ్ కి, జె.వి.ఆర్ గకి కృతజ్ఞతలు తెలియజేసారు. ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో తెరకెక్కించిన సినిమా అని చెప్పారు.


హీరోయిన్ సోని చరిష్ట మాట్లాడుతూ : నాకు ఈ  చిత్రంలో హీరోయిన్ అవకాశం ఇచ్చిన మా దర్శకుడు సమీర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులు, మీడియా మా సినిమా సపోర్ట్ చేసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.  


నిర్మాత, దర్శకుడు సమీర్ మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన సినిమా పెద్దలైన  ప్రసన్న కుమార్ కి, రామకృష్ణ గౌడ్ కి, జే వి ఆర్ కి , రవి కి, డిఎస్ రెడ్డి కి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  మంచి మంచి లొకేషన్స్ లో హై క్వాలిటీ లో తెరకెక్కించాము. అర్జున్ గారు, చక్రవర్తి గారు పోటీ పడి మరి నటించారు. హీరోయిన్స్ గా రాధిక కుమారస్వామి, సోనీ ఇద్దరూ చాలా బాగా యాక్ట్ చేశారు. దివంగత కళాతపస్వి కె. విశ్వనాథ్ గారికి ఇది లాస్ట్ మూవీ. కె. విశ్వనాథ్ గారు ఇష్టంగా చేసిన సినిమా ఇది. అంతేకాకుండా ఒక పాటలో స్టెప్స్ కూడా వేశారు. అమీర్ ఖాన్ గారి తమ్ముడు ఫైజల్ ఖాన్ గారు కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.  అ నెల 18న  విడుదల  కాబోతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాము.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి