రివ్యూ: జాతర (Jathara)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటీనటులు: సతీష్ బాబు రత్న కొండ, దీయా రాజ్, ఆర్కే నాయుడు మెహబూబ్ పాషా షేక్  తదితరులు..


ఎడిటర్: మహేంద్ర నాథ్


సినిమాటోగ్రఫీ: కే.వి.ప్రసాద్


సంగీతం: శ్రీజిత్ ఎద్వానా


సహ నిర్మాత: ద్వారంపూడి శివ శంకర్ రెడ్డి


నిర్మాణ సంస్థ: రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ


నిర్మాత : ద్వారంపూడి రాధాకృష్ణ రెడ్డి


దర్శకత్వం: సతీష్ బాబు రత్నకొండ


విడుదల తేది : నవంబర్ 8


తెలుగు సహా ఇతర భాషల్లో డెవోషనల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో తెరకెక్కిన మరో ఢిఫరెంట్ కాన్సెప్ట్ డెవోషనల్ చిత్రం ‘జాతర’. ముఖ్యంగా ఊర్లో అమ్మోరు తల్లి నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. మరి ‘జాతర’ పేరుతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  


కథ
ఒక ఊర్లో అమ్మోరు తల్లిని పాలేటి కుటుంబం నిత్యం ఆరాధిస్తూ ఉంటుంది. పాలేటీ కుటుంబానికి చెందిన పూజారి కొడుకు చలపతి (సతీష్ బాబు). తండ్రిలాగే భక్తుడు కాకుండా నాస్తికుడుగా ఉంటాడు. అతను ఊర్లో ఉంటున్న ఓ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు.అంతా నార్మల్ గా సాగిపోతున్న వీళ్ల లైఫ్ లోకి గింగిరెడ్డి (ఆర్కే నాయుడు) వస్తాడు. అతని రాకతో వీళ్ల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. ఆ తర్వాత హీరో కుటుంబం పూజించే అమ్మోరు మాయమవుతోంది. అసలు అమ్మోరు నిజంగానే మాయం అయిందా.. ? లేకపోతే అమ్మోరు అదృశ్యం వెనక ఏదైనా దుష్టశక్తులు కుట్ర పన్నాయా.. ? ఇంతకీ ఆ ఊర్లో ఏం జరిగింది. దేవుడిని నమ్మని చలపతి ఆ మిస్టరీని ఎలా ఛేధించాడనేదే తెలియాంటే ఈ సినిమా చూడాల్సిందే.


కథనం, విశ్లేషణ..
తెలుగులో విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలు చాలానే వచ్చాయి. అదులో మెజారిటీ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రమే జాతర. ఇలాంటి చిత్రాలకు కథ కంటే అందులోని కథనమే ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఆ విషయంలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు మెచ్చుకోవాల్సిందే. రీసెంట్ గా ‘కాంతార’ చిత్రం కూడా ఇదే తరహా డెవోషనల్ కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకుల మెప్పు పొందింది. ముఖ్యంగా అమ్మవారు నేపథ్యం ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమాను ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమా పై అంచనాలు పెంచారు. సెకండాఫ్ లో ప్రేక్షకులను సీట్లలో కూర్చొబెట్టడాడు.  సినిమాలో లవ్ ట్రాక్ పంటికిందా రాయిలా అనిపిస్తోంది. మొత్తంగా ఎక్కడా ల్యాగ్ చేయకుండా చకచకా కానీచ్చేసాడు. మొత్తంగా దర్శకుడిగా.. హీరోగా తానే కావడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి.ఈ సినిమాకు బీజీఎంతో పాటు సంగీతం బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.  


నటీనటుల విషయానికొస్తే..


జాతర సినిమాకు అతనే హీరోతో పాటు దర్శకుడు అతనే కావడం ప్లస్ పాయింట్. తనను తాను హీరోగా ప్రమోట్ చేసుకోవడానికి సరైన కథను ఎంచుకున్నాడు. హీరోయిన్ గా నటించిన దీయా రాజ్ సహా మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.


జాతర.. విలేజ్ డెవోషనల్ ఎమోషనల్ డ్రామా..


రేటింగ్.. 2.75/5


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.