Mango Shake Side Effects: వేసవిలో మ్యాంగో షేక్ అతిగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
Mango Shake Side Effects: వేసవిలో మాత్రమే మామిడి పండు లభిస్తుంది. దాని కోసం ఏడాదంతా ఎదురుచూసే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. అయితే మ్యాంగో షేక్ తాగడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Mango Shake Side Effects: వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది మామిడి పండ్లను తినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మామిడి పండ్లను ఇష్టంగా తింటూనే.. మామిడి పండుతో చేసిన జ్యూస్, షేక్ ను తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ, ఎండల కాలంలో మ్యాంగో షేక్ ను ఎక్కువగా తినడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అతిగా తింటే ఏదైనా విషపూరితమవుతుంది. అయితే మామిడి కాయ షేక్ అతిగా తాగడం వల్ల శరీరానికి కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం.
మ్యాంగో షేక్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..
మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఎందుకంటే మ్యాంగో షేక్ స్వభావం వేడిగా ఉంటుంది. ఈ కారణంగా వేసవిలో మామిడి షేక్ అతిగా తీసుకోకూడదు. శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
1) మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. మ్యాంగో షేక్ లో ఎక్కువ కేలరీలు ఉండటమే అందుకు కారణం. కాబట్టి మ్యాంగో షేక్ ను మితంగా తీసుకోవాలి.
2) మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. శరీరంలో వేడి పెరగడం వల్ల వాంతులు, అతిసారం, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి.
3) మ్యాంగో షేక్స్ ఎక్కువగా తాగడం వల్ల కూడా అలర్జీ సమస్య కూడా వస్తుంది. కొంతమందికి దురద, దద్దుర్లు మొదలైన సమస్యలు ఉండవచ్చు.
(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా నివేదికలు, చిట్కాల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించబడింది.)
Also Read: Health Tips: వారు టమోటాలను అస్సలే తినకూడదు..తింటే ప్రమాదమే..!!
ALso Read: Do Not Eat This Fruit at Night: రాత్రి పూట ఈ పండ్లను తింటే శరీరానికి ప్రమాదమే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.