Indrani: అందం, అభినయం తన క్లాసికల్ డాన్స్ తో ఆడియన్స్ దృష్టితో అట్రాక్ట్ చేస్తోన్న నటి ఇంద్రాణి దావులూరి. తన అద్భుతమైన పటిమను మన దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయంలో  ప్రదర్శన ఇచ్చారు. సాక్షాత్తు నటరాజు జన్మస్థానమైన చిదంబరం ఆలయంలో ప్రదర్శన ఇవ్వడానికి ఆలయ కమిటీ ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భంగా ఇంద్రాణి దావులూరి సంతోషం వ్యక్తం చేశారు. ఆలయంలో డాన్స్ చేయడం తన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివిధ వాయిద్యాలు  నడుమ దాదాపు 80 నిమిషాల పాటు ఏక ధాటిగా ఇంద్రాణి దావులూరి  అద్భుత  నృత్య ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ ఇంద్రాణి దావులూరికి నాట్య మయూరి బిరుదును ప్రధానం చేశారు. ఈ బిరుదు పట్ట ఇండ్రాని ఎంతో ఆనంతం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు ఆలయంలో నృత్య ప్రదర్శన చేయడానికి  అవకాశం ఇచ్చిన ఆలయ పెద్దలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసారు.


ఇంద్రాణి దావులూరి విషయానికొస్తే.. ఈమె ఉన్నత విద్యను అభ్యసించారు. మైక్రో బయాలజీ, పర్ఫార్మింగ్ ఆఫ్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చేశారు. అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. కేవలం క్లాసికల్ డాన్స్ మాత్రమే కాదు అనేక టెలివిజన్ యాడ్స్ లో  నటించారు. మంజల్ సోప్, చుంగత్ జ్యువెలర్స్, చమ్మనూర్ జ్యువెలర్స్, సింగ్ మెహందీ, క్షేత్ర వంటి అనేక రకాల ప్రకటనలో మెరిచారు.


వీటితోపాటు మలయాళ మనోరమ వంటి యోగా వీడియోలు, మాఫియా, యువర్స్ మేఘన వంటి ఇంగ్లీష్ షార్ట్ ఫిలిమ్స్ లలో నటించారు ఇంద్రాణి దావులూరి. ఈ రూట్లోనే తన అభినయం, నృత్యం, నటనతో మరింత ముందుకు సాగుతూ.. అన్ని భాషా చిత్రాల్లో  సిల్వర్ స్క్రీన్ పై  మరిన్ని విజయాలను అధిరోహించాలని ఆమె సన్నిహితులు అభిమానులు కోరుకుంటున్నారు.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter