Prabhutva Junior Kalasala OTT Streaming: రెండు ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల`మూవీ..
Prabhutva Junior Kalasala OTT Streaming: ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జోడిగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 21న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్సాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Prabhutva Junior Kalasala OTT Streaming: యదార్థ సంఘటనల ఆధారంగా శ్రీనాథ్ పులకురం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూర్ -500143’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్ మరియు ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. థియేట్రికల్ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరో వారం రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా అందుబాటులో రానుంది. అంతా కొత్త వారితో చేసిన ఈ చిన్న చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం మెప్పిస్తోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఈ చిత్రం ప్రస్తుతం ఆహాతో పాటుగా అమెరికన్ తెలుగు ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వచ్చే వారం నుంచి భారతీయ ప్రేక్షకుల కోసం ఆహాతో పాటుగా అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది.ప్రతీ వ్యక్తి జీవితంలో తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా కలకాలం గుర్తుండి పోతుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు దర్శకులు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు.. ఇలా యూత్ కు నచ్చే అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యంగా ఈ సినిమాను చక్కగా మలిచాడు దర్శకుడు. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియెన్స్ సైతం ఫిదా అవుతున్నారు.
‘థియేటర్‌లో యూత్‌ని అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’లో కుటుంబ ప్రేక్షకుల మెప్పును పొందడట విశేషం. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరో వారం తరువాత అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ కు రానుందని అని దర్శక నిర్మాతలు తెలిపారు.
నటీనటులు:
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల
సాంకేతిక వర్గం:
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి