Shiva Kantamneni as Big Brother: శివ కంఠంనేని టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'బిగ్ బ్రదర్'. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను భోజ్‌పురిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి ఆఫ్ భోజపురిగా పేరు తెచ్చుకున్న గోసంగి సుబ్బారావు  చాలా కాలం తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు.  లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కె. శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఘంటా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే కథానాయికగా నటించింది. శ్రీ సూర్య, ప్రీతి శుక్లా ఇంకో జంటగా అలరించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్ బ్రదర్ రిలీజ్ సందర్భంగా.. దర్శకుడు గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ...
 
బిగ్ బ్రదర్ టైటిల్‌తోనే ఇది అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్‌తో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చారు.  శివ కంఠంనేని మరోసారి ఇందులో అవార్డ్ విన్నింగ్ నటన కనబరిచినట్టు చెప్పుకొచ్చారు. నందమూరి కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ చిత్రం "బింబిసార"కు యాక్షన్ కొరియోగ్రఫి చేసిన ఫైట్ మాస్టర్ రామకృష్ణ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా  ఈ సినిమా  విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు.  ఇకపై తెలుగులో వరసగా సినిమాలు చేస్తానన్నారు.


గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం: గోసంగి సుబ్బారావు.


Also Read: Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter