Parakamani: తెలుగులో మరో డిఫరెంట్ సోషియో ఫాంటసీ మూవీ ‘పరకామణి’ సినిమా గ్రాండ్ గా ప్రారంభం..
Parakamani: తెలుగులో ఎప్పటికప్పడు డిఫరెంట్ మూవీస్ వివిధ దర్శకులు అలరిస్తున్నారు. ఈ కోవలో ఎర్రచీరతో దర్శకుడిగా త్వరలో పలకరించబోతున్న సి. హెచ్. సుమన్ బాబు మరో సారి మెగా ఫోన్ పట్టుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ‘పరకామణి’. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Parakamani: తెలుగులో త్వరలో ‘ఎర్రచీర’ సినిమాతో దర్శకుడిగా అలరించబోతున్న సుమన్ బాబు .. ఆ సినిమా విడుదల కాకముందే తాజాగా తన ఓన్ డైరెక్షన్ లో మరో అద్భుతమైన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ జానర్లో నిర్మిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ చిత్రం టైటిల్ ‘పరకామణి’ పోస్టర్ ను విడుదల చేశారు. మనకు ‘పరకామణి’ అంటే తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శ్రీవారి హుండీని లెక్కించే స్థలాన్ని ‘పరకామణి’గా పిలుస్తుంటారు. ఆ టైటిల్ తో ఈ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసారు.
ఇంతకు ముందు ఎన్నడూ చూడని సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ సి.హెచ్. సుమన్ బాబు తెలిపారు. సుమారు రూ.20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సృష్టిలో పైన ఏడు లోకాలు.. కింద ఏడు లోకాలున్నాయేది శాస్త్ర వచనం. అందులో భూలోకంలో కిందనున్న ఏడు లోకాలైన అతల, వితల, సుతల, తలా తల, రసాతల, పాతాళ, భూతల లోకాలను చూపిస్తూ, అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కూడా ప్రేక్షకులను సరికొత్త అనుభూతి ఇవ్వడం పక్కా అని చెబుతున్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలిద్దరు నటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇతర నటీనటుల వివరాలు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. అయితే సుమన్ బాబు నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఎర్ర చీర డిసెంబర్ 20న విడుదల కానుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.