Jewel Thief Movie: సస్పెన్స్ థ్రిల్లర్‌గా జ్యువెల్ థీఫ్.. ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేసిందా..?
Jewel Thief Movie Review and Rating: సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన జ్యువెల్ థీఫ్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ హీరోహీరోయిన్స్‌గా నటించగా.. పీఎస్ నారాయణ దర్వకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా రివ్యూ ఇలా..
Jewel Thief Movie Review and Rating: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఆడియన్స్ ఇష్టంగా చూస్తారు. పర్‌ఫెక్ట్ కంటెంట్‌తో సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ.. ట్విస్టులు ఇస్తే ఆ సినిమాలను సూపర్ హిట్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటి కోవలోనే జ్యువెల్ థీఫ్- Beware of Burglar అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పీఎస్ నారాయణ దర్శకత్వం వహించగా.. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై మల్లెల ప్రభాకర్ నిర్మించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చుద్దాం..
కథ ఏంటంటే..
కృష్ణ (కృష్ణసాయి) సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్. శివారెడ్డితో కలిసి వజ్రాలు, బంగారం దోచుకుని.. వచ్చిన డబ్బులను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తుంటారు. ఈ క్రమంలో నేహ (మీనాక్షి జైస్వాల్) నెక్లెస్ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోతారు. కృష్ణ జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత అతను చేసే మంచి పనుల గురించి తెలుసుకుని నేహ ప్రేమలో పడిపోతుంది. అయితే కృష్ణకు ఓ కండీషన్ పెడుతుంది. ఎవరినీ మోసం చేయకుండా.. ఎలాంటి జూదం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలని ఛాలెంజ్ పెడుతుంది. ఎవరినీ మోసం చేయకూడదనే ఉద్దేశంతో బాగా డబ్బున్న వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆయన వద్ద పనులు చేయడానికి చేరతాడు. ఈ క్రమంలో ఆయనను చంపినట్లు హత్య కేసులో చిక్కిపోతాడు. కృష్ణను నమ్మించి ఊహించని దెబ్బ కొడతారు. కృష్ణను మోసం చేసింది ఎవరు..? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? హత్య కేసు నుంచి బయటపడ్డడా..? వంటి విషయాలు చుట్టూ మూవీ కథ నడుస్తుంది.
ఎవరి ఎలా నటించారు..?
హీరోగా కృష్ణసాయి తన పాత్రలో ఒదిగిపోయారు. డ్యాన్స్, మెనరిజమ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఫైట్స్ సీన్స్‌లో దుమ్ములేపాడు. నేహ పాత్రలో హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ గ్లామర్‌తో అలరించింది. సీనియర్ నటులు ప్రేమ, అజయ్ తమ పాత్రలకు న్యాయం చేయగా.. "30 ఇయర్స్" పృథ్వి, శివారెడ్డి తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
విశ్లేషణ:
ప్రేక్షకుల టెస్ట్‌కు తగినట్లు డైరెక్టర్ పీఎస్ నారాయణ మూవీని తెరకెక్కించారని చెప్పొచ్చు. తాను రాసుకున్న కథను అదే రీతిలో రూపొందించారు. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఆర్ఆర్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. ఫైట్ మాస్టర్ మార్షల్ రమణ స్టంట్స్ ఆకట్టుకునేలా క్రియేట్ చేశారు.
రేటింగ్: 2.75/5
Also Read: Liquor shops: మందు బాబులకు బిగ్ షాక్.. పాపం.. పెద్ద కష్టమే వచ్చిపడింది.. అసలు విషయం ఏంటంటే..?
Also Read: Iqoo 13 Price: ఫీచర్స్ అన్ని అదుర్స్.. 50MP ప్రధాన కెమెరాతో iQOO 13 మొబైల్ విడుదల..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.