The Deal: టాలీవుడ్ మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది డీల్’.. ఈ నెల 18న విడుదల..
The Deal Pre Release: ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరో దోస్త్ పాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు హను కోట. ఇపుడు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది డీల్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
The Deal Pre Release: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘ఈశ్వర్’ చిత్రంతో యాక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు హను కోట. ఇపుడు చాలా కాలం తర్వాత ఈయన హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీని సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనితరావు సమర్పణలో తెరకెక్కుతోంది. హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి భారీ ఎత్తున నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. "ది డీల్ " సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత బసిరెడ్డి మాట్లాడుతూ - "ది డీల్ " సినిమాను చూశాను. చాలా బాగుంది. తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమా టీమ్ నాకు చాలా దగ్గరి వాళ్లు. ‘ది డీల్ ’ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే ఆశిస్తున్నట్టు చెప్పారు. సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
హీరో కమ్ డైరెక్టర్ హను కోట్ల మాట్లాడుతూ - ఈ రోజు మమ్మల్ని దీవించేందుకు వచ్చిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. హీరో, డైరెక్టర్ కావాలనేది నా కల. ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో "ది డీల్ " సినిమాను డైరెక్ట్ చేసి నటించిన విసయాన్ని ప్రస్తావించారు. నేను ఈశ్వర్ సినిమాలో యాక్ట్ చేశాకా.. మళ్ హీరో దోస్త్ క్యారెక్టర్స్ కోసమే అడిగారు. అయితే హీరో కావాలనే నా కల కోసమే ప్రయత్నించాను. మన జీవితం ఎంతో చిన్నది. అనుకున్నవి సాధించుకోవాలి. నాటకరంగంలో అనుభవం తెచ్చుకున్నాను. ఈటీవీ మాయాబజార్ సీరియల్ 150 ఎపిసోడ్స్ చేసిన అనుభవం ఉంది. రిలయన్స్ కోసం, ఇతర ప్రముఖ కంపెనీలు, రేడియో కోసం ప్రోగ్రామ్స్ చేశాను. "ది డీల్ " సినిమాతో దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చెప్పారు. ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చే మూవీ ఇది. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుంది. ‘ది డీల్’ సినిమాను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నట్టు చెప్పారు.
హీరోయిన్ చందన మాట్లాడుతూ - నాకు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని ఉండేది. కానీ కథానాయికగా అవుతానని అనుకోలేదు.నా ఫస్ట్ సినిమాలోనే ఇంత మంచి రోల్ ఇచ్చి హీరోయిన్ గా అడుగుపెట్టే ఛాన్స్ ఇచ్చిన ‘ది డీల్’ టీమ్ కు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.
హీరోయిన్ ధరణి ప్రియ మాట్లాడుతూ.. తీన్మార్ వార్తల్లో రాధగా మీ అందరి ఆదరణ పొందాను. నేను న్యూస్ ఛానెల్ లో ఉన్నప్పుడే ‘ది డీల్’ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. దువ్వాడ జగన్నాథం, నేల టిక్కెట్టు వంటి సినిమాల్లో నటించినా చిన్న చిన్న రోల్స్ చేశాను. ఇప్పుడీ మూవీలో కథానాయికగా యాక్ట్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter