Vidya Vasula Aham OTT Review:`విద్య వాసుల అహం` మూవీ రివ్యూ.. మెప్పించిందా.. !
Vidya Vasula Aham OTT Review: ఈ మధ్య కొన్ని సినిమాలు కేవలం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కోసమే తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో తెరకెక్కిన మరో చిత్రం `విద్య వాసుల అహం`. ఈ సినిమా నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేఓకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
మూవీ రివ్యూ: విద్య వాసుల అహం
నటీనటులు: రాహుల్, శివానీ రాజశేఖర్, అభినయ, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు
ఎడిటర్: సత్య గిడుతూరి
సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి
సంగీతం: కళ్యాణి మాలిక్
నిర్మాత: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట
కథ, దర్శకత్వం: మణికాంత్ గెల్లి
విడుదల తేది: 17-5-2024
రాహుల్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'విద్య వాసుల అహం'. ఈ రోజు ఈ సినిమా థియేట్రికల్‌గా కాకుండా ఓటీటీ వేదికగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయాకొస్తే..
విద్య (శివానీ రాజశేఖర్) విశాక పట్నం వాసి. మంచి టాలెంటెడ్ అమ్మాయి. తనకు తగ్గ అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటుంది.
తాను పెట్టిన పరీక్షలో విజయం సాధించిన వాడినే పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. ఈ క్రమంలో వాసు (రాహుల్ విజయ్) ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన విద్యార్ధి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే టైమ్ గడిచేకొద్ది వారిద్దరిలో నేను ఎక్కువ అనే అహం ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి ? చివరకు వీళ్లు మళ్లీ ఒకటయ్యారా.. ? లేదా అనేది ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ మధ్యకాలంలో పెళ్లి కూతుళ్ల బిహేవియర్ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారనే విషయాన్ని తన కథలో చక్కగా ప్రెజెంట్ చేసాడు. ఈ సినిమా కోసం క్యాస్టింగ్ బాగానే ఉన్నా.. అందుకు తగ్గట్టు స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ కొన్ని లోపాలున్నా.. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో హీరో, హీరోయిన్స్ మధ్య సంబంధాలను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. ఇతర సహాయ నటులు కూరలో కరివేపాకు టైపు తరహాలో ఉంది. వాళ్లను సరిగా యూజ్ చేసుకుంటే బాగుండేది. కళ్యాణి మాలిక్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటులు విషయానికొస్తే..
ఈ చిత్రంలో రాహుల్ తన పాత్రకు న్యాయం చేసాడు. శివానీ ఈ కాలం పొగరుబోతు అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అటు గ్లామర్ విషయంలో ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్‌తో రాహుల్ విజయ్ అట్రాక్ట్ చేసాడు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
నిర్మాణ విలువలు
రీ రికార్డింగ్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్
రొటీన్ సీన్స్
రేటింగ్.. 2.75/5
Read more: Viral Video: వామ్మో.. ఇలా చేస్తున్నాడేంటీ.. కాఫీలో ఉల్లిపాయల్ని ముంచి.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter