US mid-term elections 2022: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. నిన్న మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా మిల్లర్ ఎన్నికవ్వగా.. తాజాగా మరో భారతీయ అమెరికన్ 23 ఏళ్ల నబీలా సయ్యద్ (Nabeela Syed) అతి పిన్న వయస్సులో ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికై చరిత్ర సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన నబీలా సయ్యద్ తన ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి క్రిస్ బోస్‌పై విజయం సాధించారు. ఇల్లినాయిస్ స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 51వ జిల్లా ఎన్నికలలో నబీలా సయ్యద్‌కు 52.3 శాతం ఓట్లు వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల్లో గెలుపొందడంపై నబీలా సయ్యద్ స్వయంగా ట్వీట్ చేశారు. ఆమె తన ట్వీట్‌లో ‘''నా పేరు నబీలా సయ్యద్. నేను 23 ఏళ్ల భారతీయ-అమెరికన్ ముస్లిం మహిళను. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించాను. ఇల్లినాయిస్ జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో నేనే అతి పిన్న వయస్కురాలిని'' అంటూ పోస్ట్ చేశారు. నబాలీ ట్వీట్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.


 నబీలా ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ..  ఎన్నికల బరిలోకి దిగేందుకు తన వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో అందరికి వివరించాని.. అంతేకాకుండా నిరంతర ప్రజలతో మమేకం కావడం వల్ల ఈ ఎన్నికల్లో గెలిచానని చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ... పెరుగుతున్న మందుల ధరల, ఆస్తిపన్ను భారం, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలతో చర్చించడం వల్లే విజయాన్ని అందుకున్నాని నబీలా తెలిపారు. తనకి మద్దతిచ్చిన వారందరికీ నబీలా సయ్యద్‌ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 


Also Read: Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook