Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌..

Aruna Miller: మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన అరుణా మిల్లర్(58) ఎన్నికయ్యారు. ఈమె కృష్ణా జిల్లాకు చెందినవారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2022, 07:12 AM IST
Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌..

Maryland Lieutenant Governor Aruna Miller: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు అమ్మాయి సత్తా చాటింది. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్(58) ఎన్నికై చరిత్ర సృష్టించింది. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా... మేరీలాండ్ గవర్నర్ పదవి కోసం డెమోక్రటిక్‌ నాయకుడు వెస్‌ మూర్‌, లెఫ్టినెంట్ గవర్నర్ స్థానానికి అరుణా మిల్లర్‌ (Aruna Miller) పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులపై వీరిద్ధరూ గెలుపొందారు. గవర్నర్ తర్వాత హోదాలో లెప్టినెంట్ గవర్నర్ ఉంటారు. అలాంటి ఈస్థానానికి తెలుగు అమ్మాయి చేరడం నిజంగా మనకు గర్వకారణం. వీరు ఎన్నికల్లో గెలవాలని అధ్యక్షుడు బో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేరీలాండ్ లో పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశాడు. 

అరుణ కుటుంబం 1972లో అమెరికాకు వలస వెళ్లింది. వీరి సొంతూరు కృష్ణా జిల్లా (Krishna District) పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. కాట్రగడ్డ వెంకటరామారావుకు రెండో సంతానం అరుణ. ఈమె విద్యాభ్యాసమంతా యూస్ లోనే  కొనసాగింది. మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అరుణ... ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌లో నిపుణురాలు కూడా. ఈమెకు 1990లో డేవిడ్‌ మిల్లర్‌తో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలిగా అరుణ ఉన్నారు. అరుణ మేరీలాండ్ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కావడంతో ఆమె సొంతూరిలో బంధువులు, గ్రామస్థులు సంబరాలు చేసుకుంటున్నారు. 

Also Read: Meta Fired 11000 employees: మెటాలో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News