డీఏసీఏ రద్దుతో భారతీయుల్లో అభద్రత
అమెరికాలో డీఏసీఏ స్కీం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డీఏసీఏ స్కీం రద్దు వల్ల నష్టపోతారని భావిస్తున్న 8 లక్షల డ్రీమర్లలో భారతీయులు సైతం అధికంగా ఉన్నారని తేలింది. భారత దేశం నుంచి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికా వెళ్లి అక్కడే పెరిగిన భారతీయులు సంఖ్య 20 వేల మంది వరకు ఉంటారని సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) లెక్కకడుతోంది.
అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు డీఏసీఏ కింద అనుమతి పొందిన 27 వేల ఆసియన్ అమెరికన్లలో భారతీయులు 5 వేల వరకు ఉన్నారు. ఇంకా డీఏసీఏ నింబంధనల ప్రకారం దరఖాస్తుకు అర్హులైన భారతీయులు 17 వేల మంది ఉంటారని అంచనా. ట్రంఫ్ ప్రభుత్వం డీఏసీఏ స్కీం పునరాలోచన చేయని పక్షంలో వీరందరికీ బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. దీంతో అక్కడ నివసిస్తున్న సగటు భారతీయుల్లో అభద్రతా భావం నెలకొంది.