కరోనా వైరస్ (CoronaVirus) సోకిన వారికి చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రిలో బిల్లు 3 నుంచి 5 లక్షల రూపాయలు అవుతుందంటేనే వామ్మో అని కళ్లు తేలేస్తున్నారు. అయితే గల్ఫ్ వలస కార్మికుడి కరోనా ట్రీట్‌మెంట్ బిల్లు (Corona Patient Bill RS 1.52 crore) ఏకంగా రూ.1.52 కోట్లు అయింది. తెలంగాణకు చెందిన కార్మికుడికి స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రి సహకారంతో ఈ మొత్తం బిల్లును మానవతా దృక్పథంతో మాఫీ చేయడం గమనార్హం. తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స, ఫ్రీగా కోవిడ్ టెస్టులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన ఒడ్నాల రాజేష్ ఉపాధి కోసం దుబాయ్ వలసవెళ్లాడు. కరోనా లక్షణాలతో ఏప్రిల్ 23న దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. టెస్టుల్లో అతడికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. దాదాపు 80 రోజులపాటు కరోనాతో పోరాడిన తర్వాత రాజేష్ కోలుకున్నాడు. హాస్పిటల్ యాజమాన్యం డిశ్ఛార్జ్ చేస్తూ ట్రీట్‌మెంట్‌కు 7,62,555 అరబ్ ఎమిరేట్ దిర్హమ్స్ (భారత కరెన్సీలో రూ.1.52 కోట్లు) బిల్లు (Corona Bill) చేతిలో పెట్టారు. Telangana: మరో 11 మందిని బలి తీసుకున్న కరోనా


రాజేష్ ఆసుపత్రిలో చేరినప్పటినుంచీ సహాయ సహకారాలు అందిస్తున్న దుబాయ్‌లోని గల్ఫ్ కార్మికుల సంరక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహ అక్కడ భారత కాన్సులేట్ వాలంటీర్ సుమంత్ రెడ్డికి విషయాన్ని తెలిపి సహాయం చేరాలని కోరారు. బాప్స్ స్వామినారాయణన్, దేవాలయ కమిటీ సభ్యుడు అశోక్ రెడ్డి కోటేచాలు కార్మికుడు రాజేష్‌కు సహాయం చేయాలని భారత కాన్సులేట్ లేబర్ కాన్సూల్ ఆఫీసర్ హర్జిత్‌సింగ్‌ను కోరారు. మానవతాదృక్పథంతో పేద కార్మికుడి కరోనా ట్రీట్‌మెంట్ బిల్లు (COVID19 Bill) మాఫీ చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించి కరోనా బిల్లు మాఫీ చేశారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


కరోనా నుంచి కోలుకున్న రాజేష్‌తో పాటు భారత్‌కు వెంట వస్తున్న కంకయ్యకు అశోక్ కోటేచా విమాన టిక్కెట్లు, చేతిఖర్చులకు రూ.10 అందించారు. బుధవారం వేకువజామున ఎయిర్ ఇండియా విమానంలో రాజేష్, కంకయ్య హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లాలోని వారి స్వస్థలానికి చేరుకున్నారు. 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..