Telugu Girls Arrest: అమెరికాలో పరువు తీసిన తెలుగు అమ్మాయిలు.. దొంగతనం చేసి జైలుపాలు
Hoboken City Police Arrested Two Telugu Students In US: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు యువతులు పరువు మొత్తం తీశారు. అక్కడ దొంగతనానికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
Telugu Students Arrest: చదువుకోవడానికి విదేశానికి వెళ్లి తెలుగు యువతులు బుద్ధి మార్చుకోలేదు. తుంటరి పని చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. కిరాణా దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. దొంగతనంగా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తీసుకెళ్లారు. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో చోటుచేసుకుంది.
Also Read: Free Fire Dispute: ఆన్‌లైన్ గేమ్‌లో అమ్మాయితో గొడవ.. కారు తగలబెట్టిన యువకుడు
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన 22 ఏళ్లు కలిగిన అమ్మాయి, హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల అమ్మాయి స్నేహితులు. మార్చి 19వ తేదీన అక్కడి హోబొకెన్ సిటీలో వారిద్దరూ కిరాణ దుకాణానికి వెళ్లారు. కొన్ని వస్తువులు కొనుగోలు చేసి కొన్నింటికి డబ్బు చెల్లించలేదు. ఈ విషయాన్ని గుర్తించిన దుకాణ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం జైలుకు తీసుకెళ్లారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
Also Read: Cheap Air Fares: విమాన ప్రయాణికులకు బంపరాఫర్.. బిర్యానీ ధరకే విమాన ప్రయాణం
యువతుల వాగ్వాదం
ఈ పరిణామంతో యువతులు నివ్వెరపోయారు. తాము కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బు చెల్లించడం మరచిపోయామని యువతులు చెబుతున్నారు. పొరపాటున జరిగిందని క్షమించండి అని ప్రార్థించిన పోలీసులు, దుకాణ యాజమాన్యం వినిపించుకోలేదు. యువతులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మేము చేసింది తప్పేనని యువతులు చెప్పి వాటికి రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇకపై ఇలా చేయమని ప్రార్థేయ పడ్డారు. కానీ పోలీసులు వినిపించుకోకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయపరమైన చర్యలు ఆ యువతులు ఎదుర్కోవాల్సిందే. ఆ ఇద్దరు యువతులు స్టీవెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ చదువుతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం న్యూజెర్సీకి వచ్చిన యువతులు కష్టాల్లో పడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter