First female Sikh judge in US: అమెరికాలో తొలి మహిళా సిక్కు జడ్జిగా భారత సంతతికి చెందిన మన్‌‌ప్రీత్ మోనికా సింగ్ (Manpreet Monica Singh) నియమితులయ్యారు. టెక్సస్‌‌లోని హ్యూస్టన్ నగరంలో ఉన్న హారిస్ కౌంటీ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. కోర్టులోని లా నెంబర్ 4 లో ఆమె జడ్జిగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ న్యాయమూర్తి రవి సంధిల్ నేతృత్వంలో మోనిక ప్రమాణ స్వీకారం చేశారు. జడ్జిగా బాధ్యతలు చేపట్టడం పట్ల అమె సంతోషం వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1970 దశకంలోనే మోనిక తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌‌లో పుట్టి పెరిగిన మన్‌‌ప్రీత్ ప్రస్తుతం బెల్లైర్‌‌‌‌లో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. సౌత్ టెక్సస్ కాలేజ్ ఆఫ్ లా నుంచి పట్టా అందుకున్న ఆమె.. లాయర్ గా 20 ఏళ్లపాటు సేవలందించారు. మోనిక పలు పౌరహక్కుల సంస్థల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 


యూఎస్ లో 5 లక్షల మంది సిక్కులు ఉన్నట్లు అంచనా. హ్యూస్టన్ ప్రాంతంలో సుమారు 20,000 మంది సిక్కులు నివసిస్తున్నారు. మోనికా జడ్జిగా నియామకం కావడంపై హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఇలా అన్నారు. ఇది సిక్కులకు ఎంతో గర్వకారమైన రోజు అని, హ్యూస్టన్ లో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని ఆమె అన్నారు. 


Also Read: US Firing: షాకింగ్ ఘటన.. టీచర్‌పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook