KTR Davos Tour: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 18 న లండన్ వెళ్లిన మంత్రి కేటీఆర్ అక్కడ పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం స్విడ్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచంలోని పలు ప్రఖ్యాత కంపెనీల బృందాలతో సమావేశమయ్యారు. మొత్తం 45 కంపెనీల బృందాలతో సమావేశమైన కేటీఆర్ తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని వారిని ఆహ్వానించారు. కేటీఆర్ కృషికి ఫలితంగా సుమారు 4200 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తరలివచ్చాయి. ఈ మేరకు పలు ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనదేశంతో పాటు... మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్‌ను ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ తో సమావేశాలకు, చర్చాగోష్టులకు తెలంగాణ పెవిలియన్ వేదికగా మారింది. ఇక్కడ ఫార్మా లైఫ్ సైన్స్‌తో పాటు.. ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులతో కేటీఆర్ చర్చలు జరిపారు. వీటితో పాటు డబ్ల్యూఈఎఫ్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సీఐఐ పెవిలియన్ లలో జరిగిన చర్చల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఇందులో మంత్రి వెలిబుచ్చిన అభిప్రాయాలను అందరూ ప్రశంసించారు. దావోస్‌ పర్యటన ప్రభుత్వ విధానాలతో పాటు పెట్టుబడి అవకాశాలు వివరించడంలో ఎంతగానో సహాయపడిందని కేటీఆర్ అన్నారు. ఈ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై సంతృప్తి వ్యక్తంచేశారు. పర్యటన విజయవంతానికి కృషిచేసిన వారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.


అటు స్విడ్జర్లాండ్‌లోని జ్యురిక్ నగరంలో ZF కంపెనీ తో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మూడువేల మంది ఉద్యోగులతో హైదరాబాద్ లోని ఆఫీసు అతిపెద్దదిగా మారబోతున్నట్లు తెలిపింది. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వంద ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందని... హైదరాబాద్‌లో ప్రారంభించే నూతన క్యాంపస్ అతిపెద్దదిగా ఉండబోతున్నట్లు తెలిపింది. జూన్ ఒకటిన తమ కార్యాలయాన్ని నానక్‌రామ్‌గూడలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. ZF కంపెనీ విస్తరణతో తెలంగాణతో మొబిలిటీ రంగానికి అదనపు బలం లభిస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 


Also read : KTR Davos Tour: కేటీఆర్ దావోస్‌ పర్యటన, తెలంగాణకు క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలు


Also read : British Airways: హైదరాబాద్-లండన్ విమానాల్లో తెలుగు మాట్లాడే సిబ్బంది నియామకం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి