Saudi Arabia: ఇంటి నుంచి పని చేయడం కాదు.. ఆఫీసుకు రావాల్సిందే.
సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచి పని చేయడం ఇక అవసరం లేదు అని నిర్ణయించింది
సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచి పని చేయడం ఇక అవసరం లేదు అని నిర్ణయించింది. ఉద్యోగులు ఈ నెలాఖరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home ) ఆపేసి ఆఫీస్ నుంచి పనిచేయడం మొదలు పెట్టాలి అని సూచించింది. ఆగస్టు 30 నుంచి నో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పింది.
ప్రస్తుతం సౌదీ ప్రభుత్వానికి ( Saudi Arabia ) సంబంధించి ఎంతో మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇక ఇలా కొనసాగడం మంచిది కాదు అని ఆ దేశ మానవ వనరుల శాఖ మంత్రి అల్ రజీ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విభాగ అధిపతులకు సర్య్కూలర్ జారీ చేశారు. సూచనలు అమలు అయ్యేలా చూడమని డిపార్ట్ మెంట్ హెడ్స్ కు ఆదేశించారు.
అదే సమయంలో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ అధికంగా ఉండటం వల్ల వేలిముద్రలతో లాగిన్ అవడం అనేదాన్ని ఇప్పటికి అయితే నిలిపివేశారు. మరో వైపు ఉద్యోగులు అందరూ ఆఫీసుకు వచ్చే అవసరం లేదు అని.. ఎవరి అవసరం అయితే ఎక్కువగా ఉండే.. వారి లిస్టులు తయారు చేసి వారినే ముందు సర్య్కూలర్ లో పేర్కొన్నారు.
ఈ సర్య్కూలర్ లో 25 శాతాన్ని మించి ఏ సంస్థలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే అవసరం లేదు అని కూడా తెలిపారు. అదే సమయంలో ఆఫీస్ నుంచి పని చేసే వాళ్లు ప్రభుత్వం సూచించిన ప్రతి నియమాన్ని పాటించాలి అని.. కోవిడ్-19 ( Covid-19) ను వ్యాప్తి చేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు.