ఎండిన ఆకులా కనిపించే ఒక సీతాకోక చిలుక ( Butterfly ) ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media ) లో హల్చల్ చేస్తోంది. నెటిజెన్స్ ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. అద్భుతం అంటున్నారు.
ఈ ప్రపంచంలో నిత్యం ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ప్రపంచం వింతల మయం అని అందుకే అంటారు. కొన్ని వీడియోలు (Viral Video ) చూస్తే ఇదే అనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక రంగురంగుల సీతాకోక చిలుక కనిపిస్తుంది. దాని రెక్కలు నీలం, నారింజ, నలుపు రంగులో అద్భుతంగా కనిపిస్తుంది. అయితే అది తన రెక్కలు ముడిస్తే మాత్రం దాని రంగులు మొత్తం మాయం అవుతాయి. అది ఒక ఎండిన ఆకులా కనిపిస్తుంది. మళ్లీ రెక్కలు తెరిస్తే మళ్లీ రంగులు కనిపిస్తాయి. క్షణాల్లో సీతాకోక చిలుక కొత్తగా కనిపిస్తుంది.
One of the most incredible examples of camouflage; the Dead Leaf butterfly of Tropical Asia.
When a bird or other predator gets too close, the Dead Leaf closes its wings, rendering itself virtually invisible to the would-be killer! https://t.co/95RSkJYKaK pic.twitter.com/H7hiLbWQGE
— Butterfly Conservation (@savebutterflies) August 23, 2020
బటర్ ఫ్లై సేఫ్టీ అనే ట్విటర్ హ్యాండిల్ పై ఈ వీడియోను షేర్ చేశారు.
Viral Video: ఎండిన ఆకు కాదిది.. సీతాకోక చిలుక