Flight With Female Crew: చరిత్రలో తొలిసారి విమానం మొత్తం మహిళా క్రూ
Flight With Female Crew: గల్ఫ్ దేశాల్లో మహిళలపై అత్యంత కఠిన ఆంక్షలు అమలవుతాయి. వీటిగురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సంప్రదాయాలను పక్కనబెట్టింది.
Flight With Female Crew: గల్ఫ్ దేశాల్లో మహిళలపై అత్యంత కఠిన ఆంక్షలు అమలవుతాయి. వీటిగురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సంప్రదాయాలను పక్కనబెట్టింది. నైపుణ్యానికి పట్టం కట్టింది. సౌదీ ఏవియేషన్‌లో భాగమైన ఫ్లైఎడీల్ కంపెనీ నడుపుతున్న ఓ విమానాన్ని మొత్తం మహిళా సిబ్బందితోనే నిర్వహిస్తున్నారు. విమానంలో క్రూ మొత్తం మహిళా సిబ్బందినే ఎంపిక చేశారు. ప్రయోగాత్మకంగా ఆ విమానాన్ని మొత్తం మహిళా సిబ్బందితోనే నడిపించారు. ఎర్ర సముద్ర తీరం నుంచి జెడ్డా వరకు మహిళా సిబ్బందే ఎ-320 మోడల్ విమానాన్ని నడిపారు. అంతేకాదు.. ఈ విమనాం నడిపిన మహిళా పైలట్ అత్యంత పిన్న వయస్కురాలు.
ఆ విమానాన్ని పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. అందులో అందరూ మహిళా సిబ్బందే పనిచేస్తారు. ఇది మహిళా సాధికారతకు నిదర్శనమని, దేశ చరిత్రలో మైలురాయి అని సౌదీ ప్రభుత్వం చెబుతోంది. గత కొన్నేళ్లుగా శ్రామిక శక్తిలో ఎక్కువశాతం మహిళలు భాగస్వాములయ్యేలా సౌదీ అరేబియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు.. ఓ విమానాన్ని పూర్తిగా మహిళలే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం పూర్తిగా మహిళా సిబ్బందిని నియమించిన విమానం.. ఫ్లాగ్ క్యారియర్ సౌదికు చెందిన బడ్జెట్ అనుబంధ సంస్థ ఫ్లైఎడీల్ నిర్వహిస్తోంది. మొత్తం ఏడుగురు మహిళా సిబ్బంది ఉండగా వారిలో ఎక్కువ మంది సౌదీ అరేబియాకు చెందిన వాళ్లే.
Also read : KTR, Aditya Thackeray meeting: దావోస్‌లో కేటీఆర్‌తో ఆదిత్య థాకరే భేటీ
Also read : Hyderabad As Life Sciences Capital: లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్.. దావోస్‌లో మంత్రి కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.