సౌదీ అరేబియాకు ( Saudi Arabia ) చెందిన హ్యూమన్ రిసోర్స్ అండ్ సోషల్ డెవలెప్మెంట్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జెండర్ పే గ్యాప్ ను పూర్తిగా తొలగించేశారు. పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాన వేతనం ఇకపై లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ|  Pan India: ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన తెలుగు స్టార్స్, దర్శకనిర్మాతలు


సౌదీ ప్రభుత్వం స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమాన వేతన విధానాన్ని తొలగించింది. ఒకే ద్యోగం చేస్తున్న స్త్రీ పురుషులకు గతంలో వేరు వేరు వేతన విధానం అమలులో ఉండేది. ఇలా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. దీనిని తొలగించాల్సిందిగా కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


సౌదీ అరేబియా ప్రభుత్వ కొత్త చట్టం ఇకపై సంస్థలు లింగ భేదం పాటించి వేతనాలు నిర్ణయించే విధానాన్ని చట్టవిరుద్ధంగా మార్చింది. వర్క్ ప్లేస్ లో లింగభేదం, జాతి, వర్ణం, వయసు, డిసేబిలిటీ లేదా ఇతర కారణాల వల్ల సమాన పనికి వేరువేరు వేతనాలు ఇకపై ఇవ్వడం నేరం. దీనికి సంబంధించిన ప్రస్తావనను పెద్ద పెద్ద సంస్థలకు అక్కడి ప్రభుత్వం అందజేసింది. 



ALSO READ | Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్


సౌదీ అరేబియా మానవ వనరుల విభాగం జారీ చేసిన అదేశాల ప్రకారం ఉగ్యోగులకు అందింతే జీత భత్యాల్లో ఇకపై ఎలాంటి వివక్షతకు తావు ఉండదు. జీత భత్యాల విషయంలో ఉన్న వివక్షత గురించి సౌదీ అరేబియా మహిళ కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేస్తూ ఈ విధానాన్ని ముగించాల్సిందిగా ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు.


ఈ కౌన్సిల్ సభ్యులు మహిళలకు పురుషులతో పోల్చితే 56 శాతం తక్కువ వేతనం ఇస్తున్నట్టు ప్రభుత్వానికి నివేధించారు. ఒకేపని చేస్తున్న వారిలో ఇలా లింగభేదం ఆధారంగా వేతనం నిర్ణయించడం సరికాదు అని.. మార్పు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వానికి అందించిన పలు నివేదికల్లో వారు వివరించారు.  లింగ భేధం ఆధారంగా జీతాలు చెల్లించే విధానంలో సౌదీ అరేబియా స్థానం ప్రపంచంలో 107గా ఉంది. ఈ విధానం ముగియడంతో అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేశారు.



ALSO READ | IPL 2020: ఐపీఎల్ లో మనం మిస్సయ్యే టాప్ 5 విషయాలివే


 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR