Swati Dhingra News: ఎన్నారై స్వాతి ధింగ్రాకు ఇంగ్లాండ్‌లో అరుదైన పదవి
Swati Dhingra In England: భారతీయ సంతతి మహిళ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ స్వాతిధింగ్రాకు ఇంగ్లండ్‌లో అరుదైన పదవి లభించింది. ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంక్‌లో వడ్డీరేట్లను నిర్ణయించే కీలకమైన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో డాక్టర్ స్వాతిథింగ్రాను ఎక్స్‌టర్నల్ సభ్యురాలిగా నియమించారు.
Swati Dhingra In England: భారతీయ సంతతి మహిళ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ స్వాతిధింగ్రాకు ఇంగ్లండ్‌లో అరుదైన పదవి లభించింది. ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంక్‌లో వడ్డీరేట్లను నిర్ణయించే కీలకమైన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో డాక్టర్ స్వాతిథింగ్రాను ఎక్స్‌టర్నల్ సభ్యురాలిగా నియమించారు. ఈ కీలక కమిటీలో ఓ ఎన్నారై నియమితులు కావడం ఇదే మొదటిసారి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఈ)లో స్వాతి ధింగ్రా పనిచేస్తున్నారు. ఎకనమిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ అప్లైడ్ మైక్రో ఎకనమిక్స్, ట్రేడ్ పాలసీ, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్‌లో ఆమె స్పెషలైజేషన్ చేశారు.
ప్రస్తుతం బ్రిటన్ ట్రేడ్ మోడలింగ్ రివ్యూ ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌లో స్వాతి ధింగ్రా సభ్యురాలిగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన ఆమె ఇంగ్లండ్ ద్రవ్య పరపతి విధాన కమిటీలో బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2016 ఆగస్టు నుంచి ఆ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్న మైఖేల్ సాండ్రూస్ స్థానంలో స్వాతి ధింగ్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంక్ ఎంపీసీ టీమ్‌లో గవర్నర్‌తోపాటు, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. బ్యాంకుకు సంబంధించి ఒక సీనియర్ ఆధికారితో పాటు ఈ కమిటీలో నలుగురు ఎక్స్‌టర్నల్ సభ్యులు ఉంటారు. వీరిని బ్రిటన్ ఆర్థికమంత్రి నియమిస్తారు. ఈ ఎక్స్‌టర్నల్ సభ్యురాలిగా ఎన్నారై స్వాతి ధింగ్రా నియమితులయ్యారు. స్వాతి ధింగ్రా ఢిల్లీ యూనివర్సిటీలో చదివారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి మాస్టర్స్‌లో పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా మాడిసన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె లండన్‌లో స్థిరపడ్డారు.
Also read : Green Card: గ్రీన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్..కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా..!
Also read : NRIs Helpdesk: విద్య ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్
Also read : Venkaiah Naidu UAE Visit: ముగిసిన ఉపరాష్ట్రపతి యుఎఇ పర్యటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.