Venkaiah Naidu UAE Visit: ముగిసిన ఉపరాష్ట్రపతి యుఎఇ పర్యటన

Venkaiah Naidu UAE Visit: యుఎఇ అధ్యక్షుడు ఖలీఫా శుక్రవారం మరణించినట్టు యూఏఈ అధ్యక్ష వ్యవహారాల శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో, సంతాప సూచకంగా వెంకయ్యనాయుడు అబుదాబి వెళ్లారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 10:26 PM IST
  • యుఎఇ దివంగత అధ్యక్షుడికి దేశం తరపున సంతాపం
  • అబుదాబినుంచి తిరిగొచ్చిన వెంకయ్యనాయుడు
  • నేరుగా కోయంబత్తూరు వచ్చిన ఉప రాష్ట్రపతి
Venkaiah Naidu UAE Visit: ముగిసిన ఉపరాష్ట్రపతి యుఎఇ పర్యటన

Venkaiah Naidu UAE Visit: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ పర్యటన ముగిసింది. అక్కడి నుంచి నేరుగా విమానంలో కోయంబత్తూరు వచ్చారు వెంకయ్య. అక్కడ వెంకయ్యనాయుడుకు అధికారిక స్వాగతం లభించింది. యుఎఇ దివంగత అధ్యక్షుడు హెచ్‌.హెచ్‌.షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ సహ్యాన్‌కు దేశం తరపున సంతాపం తెలిపేందుకు వెంకయ్యనాయుడు గల్ఫ్‌ వెళ్లారు. 

venkaiah-naidu-back-to-india-after-paying-tribute-to-uae-president-sheikh-khalifa-bin-zayed.jpg

ఆదివారం మధ్యాహ్నం యుఎఇ వెళ్లిన ఉప రాష్ట్రపతి.. నేరుగా అబుదాబిలోని ముష్రిఫ్‌ ప్యాలస్‌కు చేరుకున్నారు. దివంగత ఖలీఫా స్థానంలో ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన సేక్‌ మహమ్మద్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ను వెంకయ్యనాయుడు పరామర్శించారు. మన దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ తరపున యూఎఇ రాజకుటుంబానికి ఉప రాష్ట్రపతి సంతాపం తెలియజేశారు. 

venkaiah-naidu-back-to-india-after-paying-tribute-to-uae-president-sheikh-khalifa-bin-zayed-news.jpg

యుఎఇ అధ్యక్షుడు ఖలీఫా శుక్రవారం మరణించినట్టు యూఏఈ అధ్యక్ష వ్యవహారాల శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో, సంతాప సూచకంగా వెంకయ్యనాయుడు అబుదాబి వెళ్లారు. ఖలీఫా మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఈ సమయంలో యుఎఇ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం, ప్రజలు అండగా ఉంటారని వెంకయ్య భరోసా ఇచ్చారు. మరోవైపు.. సోమవారం సాయంత్రం కోయంబత్తూరు చేరుకున్న వెంకయ్య నాయుడు (Venkaiah Naidu).. మంగళవారం ఊటీలో జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నారు.

Also read : Telugu Student Died in USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి

Also read : China Corona: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు... క్వారెంటైన్‌ కేంద్రాల్లో ప్రజలు ఇబ్బందులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News