Sahith Mangu wins Golden Gavel Award: అమెరికాలోని న్యూజెర్సీలో తన సూపర్ టాలెంట్‌తో అబ్బురపరిచాడు ఓ తెలుగు కుర్రాడు. తన అద్భుతమైన ప్రసంగాలతో ప్రతిష్టాత్మక గార్డెన్‌ స్టేట్‌ డిబేట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో విన్నర్‌గా నిలిచాడు. న్యూజెర్సీ రాష్ట్రంలో నిర్వహించిన డిబెట్‌ లీగ్‌ టోర్నమెంట్లో సాహిత్ మంగు అనే హైదరాబాదీ కుర్రాడు విజేతగా నిలిచాడు. సాహిత్ కుటుంబం హైదరాబాద్‌ నుంచి వలస వెళ్లి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెడార్ హిల్ ప్రిప‌రేట‌రీ స్కూల్లో సాహిత్ 7వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. డిబెట్ లీగ్ టోర్నమెంట్లో ఈ ఏడాది వివిధ పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు పోటీపడ్డారు. వీరందరిని దాటుకుని సాహిత్‌ మంగు గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. సాహిత్‌ చేసిన పరిశోధన, లోతైన విషయ అవగాహనకు తోడు ధాటిగా చేసిన ప్రసంగం జడ్డీలను ఆకట్టుకుంది. సాహిత్‌ను విజేతగా ప్రకటించిన న్యాయనిర్ణేతలు.. తెలుగు కుర్రాడు ఎంచుకున్న అంశాలను.. వాటికి మద్ధతుగా సేకరించిన విషయాలను ప్రత్యేకంగా అభినందించారు.  


డిబేట్‌లో సామిత్ మంగు చాలా మంచి అంశాలను ఎంచుకున్నాడు. 'సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించాలి.. యూఎస్‌లో అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావాలి.. ఫేసియల్‌ టెక్నాలజీ వల్ల చెడు కంటే మంచే ఎక్కువ.. శాఖాహారమే మంచిది-మాంసాహారం సరికాదు..' అంశాలను ఎంపిక చేసుకున్నాడు. తన స్నేహితుడితో కలిసి డిబేట్‌లో పాల్గొన్న సాహిత్ మంగు.. ఈ నాలుగు అంశాలను ధాటిగా ప్రసంగించాడు. తన వాదనతో న్యాయనిర్ణేతలను మెప్పించాడు. గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌గా నిలిచి అవార్డు అందుకున్నాడు. తన కొడుకు ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడంపట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: TSRTC: పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సూపర్ డిస్కౌంట్  


Also Read: CM Jagan Mohan Reddy: తెలంగాణను మించి ఏపీలో జీఎస్టీ వసూళ్లు.. ఆ రాష్ట్రాల కంటే ఎక్కువే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి