NRI News-Abu Dhabi: అబు ధాబి కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త గురూ
మీరు రోడ్డు ప్రాక్టిస్ చేస్తోంటే...పోలీసులు మీ వెహికల్ సీజ్ చేసే అవకాశం ఉంది. అబు ధాబి ( Abu Dhabi ) పోలీసులు కొత్త రూల్స్ జారీ చేశారు.
అబు ధాబీ పోలీసులు (Police ) ట్రాఫిక్ రూల్స్ లో భారీ మార్పులు చేశారు. ఈ రూల్స్ బ్రేక్ చేసే వారికి వాహనాన్ని పోలీసులు ఎప్పుడైనా తమతో పాటు తీసుకు వెళ్లే అవకాశం ఉంది.. ట్రాఫిక్ రూల్స్ ను మరింత కఠినతరం చేయడానికి అబు ధాబీ పోలీసులు పలు మార్పులు చేశారు. ఎమిరేట్స్ లో రూల్స్ బ్రేక్ చేసే వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోనున్నారు.
దీనిపై ఒక ప్రకటన చేసిన అబు ధాబీ పోలీసులు రూల్స్ బ్రేక్ చేసే వారికి 50,000 దిరామ్స్ ఫైన్స్ వేయనున్నారు. ఫైన్ కట్టేంత వరకు వాహనాన్ని యజమానికి అందించరు.
10 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టరాదు. అధిక స్పీడుతో బండినడిపి యాక్సిడెంట్ కు కారణం అయినా, సేఫ్ డిస్టెన్స్ పాటించకపోయినా, పాదచరుల నుంచి తగిన దూరం పాటించకపోయినా బండిని సీజ్ చేస్తారు. 5,000 దిరామ్స్ ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.ఇల్లీగల్ గా కార్ రేస్ చేసేవారికి 50,000 దిరామ్స్ ఫైన్ వేయనున్నారు.
అలాగే రెడ్ లైట్ జంప్ చేసిన వారికి కూడా 50,000 దిరామ్స్ ఫైన్ వేయనున్నారు. పోలీసులు బండి సీజ్ చేస్తే ఫైన్ లో 7,000 దిరామ్స్ జోడించనున్నారు.
తెలుగు రాష్ట్రాల తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR