Money Making: ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే 5 మార్గాలు

మీరు ఇంట్లో కూర్చునే యోగా ట్రైనింగ్ ఇవ్వవచ్చు. దీని కోసం మీరు డిజిటల్ నాలెడ్జ్ ను కాస్త పెంచుకోవాల్సి ఉంటుంది. మీరు గూగుల్ మీట్ ద్వారా క్లైంట్స్ సంపాదించుకోవచ్చు.

Last Updated : Sep 13, 2020, 02:59 PM IST
    • ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడానికి ప్రతీ రోజు మంచి రోజు. ఈ రోజు ఇంకా మంచి రోజు.
    • ఎందుకంటే మీలో ఏదైనా సాధించాలనే కసి ఉంది.
    • ఈ కసిని అలాగే కంటిన్యూ చేయండి.
Money Making: ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే 5 మార్గాలు

ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడానికి ప్రతీ రోజు మంచి రోజు. ఈ రోజు ఇంకా మంచి రోజు. ఎందుకంటే మీలో ఏదైనా సాధించాలనే కసి ఉంది. ఈ కసిని అలాగే కంటిన్యూ చేయండి. ఆలోపు మీరు ఇంట్లోనే ఉంటూ చేతినిండా సంపాదించే 5 మార్గాలు ( Five ways to Earn More ) మీకు పరిచయం చేస్తాము.  అంతే కాదు మీ వ్యాపారాన్ని ఎలా ప్రమోట్ చేయాలో కూడా మేము వివరిస్తాం. వీటిని పాటించి మీరు బాగా లాభాలు సంపాదించవచ్చు.  ఇక మ్యాటర్ లోకి వెళ్దాం..

ఆన్ లైన్ యోగా ట్రైనింగ్ ( Online Yoga Training )
మీరు ఇంట్లో ఉంటూనే యోగా ( Yoga ) ట్రైనింగ్ ఇవ్వవచ్చు. కొంచెం డిజిటల్ నాలెడ్జ్ అవసరం అంతే. మీరు జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా క్లైంట్స్ ను సంపదించవచ్చు. కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వల్ల యోగా ప్రాధాన్యత మరింతగా పెరిగింది. మీరు ఇంట్లో కూర్చొనే క్లైంట్ కు యోగా ట్రైనింగ్ ఇవ్వవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం..( Health ) ఆదాయానికి ఆదాయం.

హోమ్ గార్డెనింగ్ (  Home Gardening )
మనందరికి మొక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో పలు రకాల మొక్కలు పెంచాలి అని మనం కోరుకుంటాం. వాటికి పువ్వులు వస్తే చూసి ఆనందిస్తాం. అయితే నేటి బిజీలైఫ్ స్టైల్  ( Lifestyle ) లో హోమ్ గార్డెనింగ్ చేయడానికి మనలో చాలా మందికి సమయం లభించదు. అందుకే చాలా మంది తమ ఇంటిక వచ్చి ప్లాంటేషన్ పూర్తి చేసే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు.  దాంతో పాటు నెలకి ఒకసారి తమ గార్డెన్ ను చెక్ చేయడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అని చాలా మంది చూస్తుంటారు.  మీకు మొక్కలపై మంచి అవగాహన ఉంటే మీరు ఇంట్లో ఉంటూనే నర్సరీ రన్ చేసుకోవచ్చు.

సోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్ ( Social Media Influencer )
దీనికోసం మీరు ముందుగా చేయాల్సింది మీ వ్యక్తిత్వం, అభిరుచికి తగ్గట్టుగా టాపిక్ ఎంచుకోవడం. మీకు మంచి అవగాహన ఉన్న సబ్జెక్టును ఎంచుకోవాలి. అప్పుడే మీరు ఇంఫ్టుయెన్సర్ అవ్వగలరు.

ఫ్రీల్యాన్స్ రైటింగ్ బిజినెస్ ( Freelance Business Writing )
మీ రైటింగ్ స్కిల్స్ బాగుంటే మీరు ఫ్రీల్యాన్స్ రైటింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఆన్ లైన్ లో నేడు చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు తెలుగు, ఇంగ్లీష్ లో మంచి నాలెడ్జ్ ఉంటే మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించుకోవచ్చు.

ఆన్ లైన్ కన్సల్టెన్సీ ( Online Consultancy)
ఈ రోజుల్లో ప్రజలకు ఆన్ లైన్ నాలెడ్జ్ బాగా పెరిగింది. కరోనా వల్ల చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఆన్ లైన్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందుకే చాలా మంది డాక్టర్లు ఆన్ లైన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు.

బిజినెస్ ను ఇంట్లో ఉంటూనే ప్రమోట్ చేయండి
ఇంట్లో కూర్చుని క్లైంట్ ను సంపాదించడం చాలా కష్టం. అందుకే మీ వద్దకే క్లైంట్ వచ్చేలా చేయండి. మీ ప్రాడక్ట్ లేదా ట్యాలెంట్ ఇతరుల వద్దకు చేరే సులభమైన మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది. అందుకే మీరు ఒక ఫేస్ బుక్ గ్రూప్ క్రియేట్  చేయండి.  దీనికి మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ఇందులో మీ చుట్టుపక్కల వారిని, మీ బంధుమిత్రులను యాడ్ చేసి రెగ్యులర్ గా పోస్టు పెడుతూ ఉండండి.

తెలుగు రాష్ట్రాల తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్  వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x