PM Kisan: రైతులకు డబుల్ ధమాకా..ఈ సారి ఖాతాల్లో ఏకంగా రూ. 13,500జమ..!!
కేంద్రంలోని మోదీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ..అమలు చేస్తోంది. ఆర్థికంగా రైతులు ఎదిగేందుకు పలు రకాల పథకాలను రూపొందిస్తూ రైతన్నలకు ఆసరాగా నిలుస్తోంది. ఇప్పటికే రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తూ వారికి ఆర్ధిక సహాయం చేస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక పథకం కింది..భారత ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ప్రతి ఏటా రూ. 6,000 ఆర్ధిక సహాయం అందిస్తూన్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సహాయం రూ. 6000వేలు ప్రతిఏటా 3 విడతల్లో రైతుల అకౌట్లో జమ చేస్తోంది.
ఒక్కోవిడత కింద డిబిటి ద్వారా డైరెక్టుగా రైతుల అకౌంట్లోనే రూ. 2వేలు జమచేస్తారు. ప్రతి వాయిదా నాలుగు నెలల వ్యవధిలో ఉంటుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం 17 వాయిదాలు రిలీజ్ అయ్యాయి. గత నెల జూన్ 18న వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో ప్రధాని మోదీ ఈ పథకం 17వ విడత నిధులను రిలీజ్ చేశారు.
17వ విడత విడుదలై ఇప్పటికే నెల దాటింది. ఈ తరుణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలు నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో పీఎం కిసాన్ 18వ విడత నిధులను రిలీజ్ చేయనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఇక ఒక కుటుంబంలోని రైతు భార్యభర్తలిద్దరికీ పీఎం కిసాన్ నిధి ప్రయోజానాలను పొందుతారా లేదా అనే ప్రశ్న చాలా మంది రైతుల్లో తలెత్తుతుంది. దీనిపై ప్రభుత్వం ఎలా ప్రకటన విడుదల చేస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
ఇటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా కింది రూ. 15వేలు రైతుల అకౌంట్లో జమ చేయనుంది. ఈ వర్షాకాలం సీజన్ నుంచి దీనిని అమలు చేయనుంది ప్రభుత్వం. ఒక ఎకరానికి రూ. 7,500 చొప్పున రైతుల అకౌంట్లో జమ అవుతాయి.
వీటితోపాటు అక్టోబర్ లో పీఎం కిసాన్ డబ్బు రూ. 2వేలు కూడా జమ అవుతాయి. పల కారణాల వల్ల పెండింగ్ దఫా డబ్బులు జమకాని వారు ఈ కేవైసీ పూర్తి చేస్తే..ఆ డబ్బులు కూడా జమ అవుతాయి. గత రెండు దఫాలుగా జమ కాని వారికి అక్టోబర్ విడతతో క లిసి రూ. 6వేలు రైతు భరోసా నుంచి 7,500 మొత్తం రైతుల అకౌంట్లో రూ. 13,500 జమ కానున్నాయి.