Shubman Gills Daily Routine: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం.. క్రికెటర్‌ శుభ్‌మ‌న్ గిల్ టిప్స్‌..

Tue, 19 Nov 2024-1:55 pm,

 ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ముఖ్యంగా ప్రజలకు ఆదర్శంగా ఉండే సెలబ్రిటీలు, క్రికెటర్లు వారి జీవనశైలి, ప్రజల ఆరోగ్య అలవాట్లపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.  

సెలబ్రిటీలు, క్రికెటర్లు లక్షలాది మంది యువతకు ఆదర్శం. వీరు  ఏం చేస్తారు, ఏం తింటారు, ఎలా వ్యాయామం చేస్తారు అనేది చాలా మందికి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

 ప్రస్తుతం భారత్ క్రికెటర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ తన ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తారు? ఎలాంటి ఆరోగ్యకరమైన పద్దతులను పాటించడం వల్ల మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండవచ్చు అనేది తెలుసుకుందాం. 

శుభ్‌మన్ గిల్  ITC ఫియామా మెన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ బ్రాండ్స్‌నే గిల్‌కు కూడా ఉపయోగిస్తున్నాడు.

 తన చర్మంపై ఉండే మురికి, నూనెలను తొలగించే మంచి ఫేస్‌ వాష్‌ను ఉపయోగిస్తున్నానని గిల్ చెప్పాడు.  దీని వల్ల ఫేస్‌  రిఫ్రెషింగ్‌గా ఉంటుందని..  రోజంతా తాజా అనుభూతిని అందిస్తుంది.

నాణ్యత కలిగిన షవర్‌ జెల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా, మృదువుగా ఉంటుంది. శరీరం నుంచి దుర్వాసన కలగకుండా ఉంటుంది.  

అలాగే ఎల్లప్పుడు క్రమం తప్పకుండా షేవ్ చేయడం ముఖ్యం. షేవ్‌ చేయడం వల్ల చర్మాన్ని హైడ్రేట్‌ పరచడమే కాకుండా చికాకును తగ్గిస్తుంది. బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది.   

చివరగా మంచి పెర్ఫ్యూమ్ స్ప్రే ఉపయోగిస్తే సరిపోతుంది. మంచి పెర్ఫ్యూమ్ స్ప్రే  విశ్వాసాని నింపుతుంది. ఇది మొత్తం లూక్‌ని మార్చేస్తుంది. ఇదే శుభ్‌మన్ గిల్‌ను మరింత స్టైలిష్‌గా మార్చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link