7Th Pay Commission: కేంద్రం నుంచి 545 డ్రైవర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్.. జీతం 7వ వేతన సంఘం ప్రకారమే.. పూర్తి వివరాలు ఇవే!
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకొనేవారు పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేటి (అక్టోబర్ 08) నుంచి ప్రారంభమైంది.
ఈ లింక్ recruitment.itbpolice.nic.in ద్వారా సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 06వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ, తేదీలు, దరఖాస్తు ఫీజులు, పే స్కేల్ వంటి వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం 525 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ITBP అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ https://recruitment.itbpolice.nic.in/ ని సందర్శించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
.ఇందులో హోమ్‌పేజీకి వెళ్లి ITBP రిక్రూట్‌మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి. ఇందులో పోస్టుకు సంబంధించిన అవసరమైన వివరాలు ఉంటాయి.
ఆ తరువాత దరఖాస్తు ఫారమ్‌ను పొందాల్సి ఉంటుంది. ఇందులో మీ వివరాలు నింపి, కావాల్సిన పత్రాలను ఇవాల్సి ఉంటుంది.