2024 WW Top Gross collection Movies: ‘పుష్ప 2’ సహా 2024 మొదటి రోజు ఎక్కువ గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రాలు..

Fri, 06 Dec 2024-7:05 pm,

పుష్ప 2 ది రూల్ మూవీ 2024లో మొదటి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. దాంతో పాటు హిందీలో ఫస్ట్ డే రికార్డులను క్రియేట్ చేసింది. దాంతో పాటు మన దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా పలు రికార్డులను తన పేరిట పలు రికార్డులను పాతర వేస్తూ రప రప వెళ్లిపోతుంది.

పుష్ప 2 ది రూల్ - Pushpa 2 The Rule..

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 288.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. నిర్మాతలు మాత్రం రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు పోస్టర్ విడుదల చేసింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ పుష్ప 2 .. నాన్ రాజమౌళి హీరోగా పలు రికార్డులను క్రియేట్ చేయడం విశేషం. టాప్ 1లో నిలిచింది.

కల్కి 2898 AD:

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం 2024లో  ఫస్ట్ డే రూ. 191 కోట్ల గ్రాస్ వసూళ్లతో పుష్ప 2 వరకు  నెంబర్ ప్లేస్ లో ఉంది. పుష్ప 2తో రెండో స్థానంలో నిలిచింది.

దేవర పార్ట్ 1 .. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా  తెరకెక్కిన మూవీ ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రం ఫస్ట్ డే దాదాపు రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తాజాగా రెండో స్థానం నుంచి మూడో ప్లేస్ లోకి జారుకుంది.

గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) విక్రమ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ మూవీ ఫస్ట్ డే  ప్రపంచ వ్యాప్తంగా రూ. 105 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 3 నుంచి టాప్ 4లో వెళ్లింది.

స్త్రీ 2 .. శ్రద్దా కపూర్ హీరోయిన్ యాక్ట్ చేసిన లేడీ ఓరియంటెట్ మూవీ ‘స్త్రీ 2’. ఈ సినిమా ఫస్ట్ డే అన్ని అంచనాలు తలకిందలు చేస్తూ మన దేశంలోనే రూ. 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 5లో నిలిచింది.

గుంటూరు కారం.. 2024 యేడాది మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా ఫస్ట్ డే రూ.90 కోట్ల గ్రాస్ వసూళ్లతో  ఈ యేడాది నెంబర్ వన్ ప్లేస్ నుంచి  5వ స్థానం పడిపోయింది. తాజాగా 6వ ప్లేస్ లో నిలిచింది.    

వేటయ్యన్ .. రజినీకాంత్ కథానాయకుడిగా జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వేటయ్యన్’. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 68.35 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 7లో ఉంది. 

సింగం ఎగైన్.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవ్ గణ్ హీరోగా  తెరకెక్కిన చిత్రం ‘సింగం ఎగైన్’. ఈ చిత్రం  దీపావళి కానుకగా విడుదలై తొలి రోజు రూ. 64.50 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు ఈ ఇయర్ టాప్ 8లో నిలిచింది.

భారతీయుడు 2 (ఇండియన్ 2)..

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా  తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 58.10 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 9లో నిలిచింది.

భూల్ భులయ్య 3..

భూల్ భులయ్యా ఫ్రాంచైజీలో కార్తీన్ ఆర్యన్ హీరోగా  తెరకెక్కిన ఈ సినిమా ‘భూల్ భులయ్య 3’. ఈ మూవీ ఫస్ట్ డే రూ. 55.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి టాప్ 10లో ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link