2025 Financial Predictions: 2025లో ధన యోగం ఎవరిది? 12 రాశుల వారి ఆర్థిక ఫలాలు ఇవే.. పరిహారాలతో సహా..!
2025లో మేష రాశి వారికి ఆర్థికపరంగా మొదటి మూడు నెలలు అనుకూలంగా ఉంటాయి. కానీ, అనంతరం శని ప్రభావం వల్ల ఖర్చులు అధికమై రుణభారాలు పెరుగుతాయి. పరిహారం: శనికి తైలాభిషేకం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి.
ఈ రాశి వారికి మొదటి ఆరు నెలలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కానీ, ద్వితీయార్ధంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. పరిహారం: కనకధారా స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
2025లో ఖర్చులు అధికమవుతాయి. బృహస్పతి వ్యయస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. పరిహారం: ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది.
అష్టమ శని ప్రభావం పూర్తవడం వల్ల కొంత పురోగతి ఉంటుంది. కానీ కుటుంబానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. పరిహారం: శనికి తైలాభిషేకం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.
ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. పరిహారం: ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి.
2025లో కన్య రాశి వారికి ఆర్థికపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పరిహారం: శనికి తైలాభిషేకం చేయండి.
ఆర్థికపరంగా మొదటి నాలుగు నెలలు కఠినంగా ఉంటాయి. కానీ మే నుంచి డిసెంబర్ వరకు శుభఫలితాలు లభిస్తాయి. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
ఈ రాశి వారికి జనవరి నుండి మే వరకు ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. కానీ జూన్ తర్వాత ఖర్చులు పెరుగుతాయి. పరిహారం: శనికి తైలాభిషేకం చేయడం మంచిది.
ఈ రాశి వారికి మొదటి ఆరు నెలలు కష్టకాలం. కానీ ద్వితీయార్ధంలో ఆర్థికాభివృద్ధి ఉంటుంది. పరిహారం: కనకధారా స్తోత్రాన్ని పఠించండి.
2025లో ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తీరతాయి. ఆర్థికపరంగా పురోగతి ఉంటుంది. పరిహారం: గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి.
అప్పుల బాధలు ఉన్నా, ఆర్థికపరంగా సమస్యలు అధిగమిస్తారు. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉంటాయి. పరిహారం: ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం మంచిది.
పైన చెప్పిన వివరాలు పంచాంగం ఆధారంగా చెప్పబడినవి. జి వీటికి.. ఎటువంటి బాధ్యత వహించదు.