Actress: ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్లు చేసి రికార్డు సాధించిన తెలుగు హీరోయిన్.. ఎవరంటే..?

Thu, 02 Jan 2025-8:17 pm,

సినిమాలలో ముద్దు సీన్లు ఒకప్పుడు పెద్ద విషయం కాదు, కానీ ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిపోవడంతో.. ప్రేక్షకులు అంచనాలు కూడా పెరిగాయి. కేవలం గీతాలు లేదా పాటలు మాత్రమే కాదు, ఈ రోజుల్లో హద్దులు మీరిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా సినిమాల్లో కనిపిస్తున్నాయి. ఈ మార్పు ముఖ్యంగా నటులపై ప్రభావం చూపింది. ఎందుకంటే చాలా మంది నటులు ఇప్పుడు వారి పాత్రలలో.. ముద్దు సీన్లను భాగంగా చెసుకోవడం  ప్రారంభించారు. ముఖ్యంగా కొంతమంది హీరోలు ఇవి ఎన్ని చేస్తే అంత క్రేజ్ వస్తుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు.

ఈ నేపధ్యంలో, ఒక హీరోయిన్ కూడా ఈ రెస్ట్ లో చేరింది. లెజెండ్, పండగ చేసుకో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన..సోనాల్ చౌహాన్ ఇటీవల తన సినిమా లో 30 లిప్‌లాక్ సీన్లతో రికార్డ్ సృష్టించింది. 

ఈ ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో  సోనాల్ చౌహాన్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, 2005లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టూరిజం టైటిల్స్‌ను గెలుచుకుంది. అనంతరం సినిమాలలో అడుగుపెట్టింది. ఆమె 2008లో 'జన్నత్' సినిమాలో నటించి, తెలుగు చిత్రసీమలో కూడా బాగా గుర్తింపు పొందింది. అయితే, ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.

ఇలాంటి సమయంలో, 2013లో '3G-ఎ కిల్లర్ కనెక్షన్' అనే సినిమా వచ్చి, దీనిలో సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ, ఈ సినిమాలో ఆమె 30 లిప్‌లాక్ సీన్లతో హాట్ టాపిక్ అయ్యింది. 

 రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా కొన్ని వివాదాస్పద సన్నివేశాలు కలిగి ఉండడంతో అప్పట్లో ఈ చిత్రం ఒక పెద్ద దుమారమే రేపింది. ఇక ఏ సినిమాలో ఈ హీరోయిన్ ఏకంగా 30 లిప్‌లాక్ సీన్లలో నటించి.. మొత్తానికి రికార్డ్ అయితే సాధించింది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link