Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు
ఆర్థిక సంవత్సరం 2020-21 మరికొన్ని రోజుల్లో పూర్తికానుంది. అయితే అంతకుముందే ట్యాక్స్ పేయర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయపు పన్ను చెల్లించేవారు మార్చి 31 గడువు ముగిసేలోగా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ట్యాక్స్ చెల్లించేవారైతే డెడ్‌లోన్ ముగిసేలోగా ఈ విషయాలు తెలుసుకుని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తే జరిమానాలు, ఇతర సమస్యల నుంచి బయట పడతాం.
Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం
ఆర్థిక సంవత్సరం 2019-20 అంటే, గత ఆర్థిక ఏడాదిలో చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు మార్చి 31 వరకు తుది గడువు ఇచ్చారు. కనుక ఆలస్యంగా పన్ను దాఖలు చేసుకునే వారితో సహా ఇదివరకు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో మార్పులు చేర్పులు చేయాలనుకునేవారు నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ITR Filingjకు ఇదే చివరి అవకాశమని అధికారులు చెబుతున్నారు.
Also Read: WhatsApp Privacy Policy అంగీకరించకపోతే వినియోగదారులకు వాట్సాప్ సేవలు బంద్
భారత్‌లో అమలవుతున్న ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్లకు మినహా ప్రొఫెషనల్ ఇన్‌కమ్ ఉన్న వారు Tax Liability రూ.10,000 పన్నును అడ్వాన్స్‌గా 4 దఫాలుగా చెల్లించాలి. జూలై 15 లోగా, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15 మరియు మార్చి 15 కల్లా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఆలస్యమైతే ఒకటి శాతం పన్ను విధిస్తారు.
PAN మరియు Aadhar అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పలుమార్లు గడువు తేదిని పొడిగించింది. తాజాగా ఉన్న నియమాల ప్రకారం ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం తుది గడువు మార్చి 31న ముగియనుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో వారి PAN కార్డ్ చెల్లదు, పనిచేయదని ఆదేశాలలో పేర్కొన్నారు.
Also Read: WhatsApp: వినియోగదారులకు వాట్సాప్ సరికొత్తగా Mute Video ఫీచర్, మీరు ట్రై చేస్తారా
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Vivad Se Vishwas పథకం ప్రకారం పొడిగించిన తుది గడువు మార్చి 31, 2021న ముగియనుంది. ప్రత్యక్ష పన్నులపై వివాద్ సే విశ్వాస్ యాక్ట్ 2020 మార్చి 17,2020 నుంచి అమలులోకి వచ్చింది.