WhatsApp: వినియోగదారులకు వాట్సాప్ సరికొత్తగా Mute Video ఫీచర్, మీరు ట్రై చేస్తారా

New WhatsApp Feature | వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు బీటా వర్షన్‌లో టెస్టింగ్‌లో ఉన్న మ్యూట్ వీడియో(Mute Video) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు విడుదల చేసింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Mar 4, 2021, 04:20 PM IST
WhatsApp: వినియోగదారులకు వాట్సాప్ సరికొత్తగా Mute Video ఫీచర్, మీరు ట్రై చేస్తారా

How To Mute Videos On WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు బీటా వర్షన్‌లో టెస్టింగ్‌లో ఉన్న మ్యూట్ వీడియో(Mute Video) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు విడుదల చేసింది. 

కొంతమంది వినియోగదారులు బీటా v2.21.3.13 వర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ను పరిశీలించారు. అనంతరం మ్యూట్ వీడియో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిట్లు WABetaInfo బ్లాగ్‌లో పేర్కొంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్త మ్యూట్ వీడియో ఫీచర్ అందుబాటులోకి తెచ్చినట్లు ట్విట్టర్ ద్వారా వాట్సాప్(WhatsApp) అధికారికంగా ప్రకటించింది. మీ కాంటాక్ట్‌లో ఉన్న స్నేహితులు లేదా కుటుంబం, బంధువులకు వీడియో పంపే ముందు వీడియోను మీరు మ్యూట్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Sandes App: సత్తా చాటుతున్న సందేశ్, WhatsAppలో లేని 5 ఫీచర్లు తీసుకొచ్చిన స్వదేశీ యాప్

‘ఇది మీ కళ్లకు, చెవులకు మాత్రం కాదు. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టే సమయంలో వీడియోను మీరు ఆడియో మ్యూట్ చేసుకోవచ్చు. లేదా ఇతరులకు పంపుతున్న సమయంలోనూ మీరు వీడియో శబ్దం రాకుండా ఉండేందుకు మ్యూట్ సర్వీస్ వినియోగించుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని’ వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.  

వీడియో ఎడిటింగ్ స్క్రీన్‌లో కొత్త మ్యూట్ వీడియో ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. అయితే వీడియో ఎడిటింగ్ స్క్రీన్‌లో మ్యూట్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. మ్యూట్ ఆప్షన్‌పూ క్లిక్ చేయడం ద్వారా సీక్ బార్ కింద కొత్త వాల్యూమ్ ఐకాన్ కనిపిస్తుంది. ఎలాంటి ఆడియో లేకుండా వీడియోను పంపేందుకు సోషల్ మీడియా(Social Media) కింది విధానాన్ని పాటించాలి.

Also Read: WhatsApp: వాట్సాప్ ప్రైవసీ వివాదం, ఏకంగా Delete వాట్సాప్ ఆప్షన్‌ను‌ మాయం చేస్తుంది

1:  మొదటగా మీరు గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి అప్‌డేట్ చేసుకోండి. 

2: WhatsApp యాప్ డౌన్‌లోడ్ అయిన తరువాత యాప్ ఓపెన్ చేయాలి.

3: ఇప్పుడు మీరు వీడియో మ్యూట్ ఫీచర్‌ను వ్యక్తిగత ఛాట్ లేదా గ్రూప్ ఛాట్‌లలో పొందుతారు

4: మ్యూట్ వీడియో ఫీచర్ వినియోగించుకోవాలంటే ఛాట్ లేదా స్టేటస్ ఓపెన్ చేసి ఏదైనా వీడియోను రికార్డు చేయాలి

5: వీడియో రికార్డు చేయడం పూర్తయ్యాక ఎడమవైపు పైభాగంలో వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మ్యూట్ ఆప్షన్ ఎంచుకుని వీడియోను ఎలాంటి ఆడియో(Sound) లేకుండా పంపవచ్చు. లేదా స్టేటస్‌గానూ అప్‌లోడ్ చేయవచ్చునని వాట్సాప్ స్పష్టం చేసింది.

Also Read: Funny Memes On Petrol Price: పెరుగుతున్న ఇంధన ధరలపై ఫన్నీ జోక్స్, వైరల్ అవుతున్న Funny Jokes On Fuel Price

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News