Weekly Diet Plan: 7 రోజుల డైట్‌ ప్రణాళిక ఇదే.. 5 కిలోలు ఇట్టే బరువు తగ్గుతారు

Mon, 29 Jul 2024-12:04 pm,

Weekly Diet Plan For Wieght Loss: దేశంలో దక్షిణ భారతీయ వంటకాలు ఎంతో రుచికరం, ఆరోగ్యకరంగా ఉంటాయి. వారం రోజుల డైట్‌ ప్రణాళికలో దక్షిణాది వంటకాలు భాగం చేసుకుంటే మీరు అనూహ్యంగా బరువు తగ్గుతారు. రుచులలో రాజీ పడకుండా బరువు తగ్గడంలో మీకు సహాయపడే 7 రోజుల డైట్ ప్రణాళిక తెలుసుకోండి.

మొదటి రోజు అల్పాహారం: కొంచెం చట్నీతో 2-4 సాంబార్‌ ఇడ్లీలను తినండి. మధ్యాహ్న భోజనం: బ్రౌన్ రైస్‌తో పాటు అన్ని కూరగాయలతో కలిపిన కూరను వేసుకుని తినండి. క్యారెట్‌లు, బీన్స్, బఠానీలు తప్పనిసరిగా ఉండాలి. చిరుతిండి: వేయించిన వేరుశెనగలు తినండి. రాత్రి భోజనం: పుదీనా చట్నీతో దోస తినండి.

2వ రోజు అల్పాహారం: కొబ్బరి చట్నీతో కూరగాయల ఉప్మా తీసుకోండి.  మధ్యాహ్న భోజనం: కూరగాయలతో కూడిన క్వినోవా పులావ్‌ను తినండి. చిరుతిండి: ఫ్రూట్ సలాడ్ తీసుకుండి. వాటిలో నీరు అధికంగా ఉండే పుచ్చకాయ లాంటివి తీసుకోండి. రాత్రి భోజనం: రైతాతో వెజిటబుల్ బిర్యానీ తినండి.

3వ రోజు అల్పాహారం: కూరగాయలతో అటుకుల ఉప్మా (పోహా) తినండి. మధ్యాహ్న భోజనం: బచ్చలికూర పప్పు, మామిడికాయ పచ్చడితో కొంచెం బ్రౌన్ రైస్ తినండి.  అల్పాహారం: గ్రీన్ టీ సేవించండి. రాత్రి భోజనం: కొబ్బరి చట్నీతో పాటు 2 మిల్లెట్ దోసెలను తినండి.

4వ రోజు అల్పాహారం: టమాటో చట్నీ, కొంచెం మజ్జిగతో 2 రాగి దోసెలు తినండి.  మధ్యాహ్న భోజనం: క్వినోవాను ఉడకబెట్టి కూరగాయలతో కూడిన కూరను వేసుకుని వేడిగా తినండి.  చిరుతిండి: ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మరసం కలిపిన మొలకెత్తిన గింజలను తినండి. రాత్రి భోజనం: 2 చపాతీలు వంకాయ కూరతో తినండి. జీలకర్ర నీటితో తాగండి.

5వ రోజు అల్పాహారం: రోటీన్-రిచ్ అడై దోసను పుదీనా లేదా పెరుగు చట్నీతో తినండి. మధ్యాహ్న భోజనం: ఆలూ-గోబీ కూరతో బ్రౌన్ రైస్, ఒక కప్పు టొమాటో చారుతో తినండి.  చిరుతిండి: ఉప్పు, మిరియాలు వేసి ఉడికించిన మొక్కజొన్నను ఒక చిన్న కప్పు తినండి. రాత్రి భోజనం: టమాట రైస్ లేదంటే ఆలు గడ్డ కూరతో కొంచెం అన్నం తినండి.

6వ రోజు అల్పాహారం: కూరగాయలు, వేరుశెనగలు జోడించి కొన్ని రుచికరమైన వెర్మిసెల్లిని చేసుకుని తినండి. మరింత కారం కావాలంటే వేరుశెనగ-మిరపకాయ చట్నీతో తినండి.  మధ్యాహ్న భోజనం: బ్రౌన్ రైస్‌తో పాటు కూరగాయలతో కూడిన సాంబార్ తీసుకోండి. తెల్ల అన్నంతో అయినా తినవచ్చు.  రాత్రి భోజనం: మల్టీగ్రెయిన్ పిండి చపాతీలు, గుమ్మడికాయ కూరతో తినండి. ఒక కప్పు గ్రీన్ టీతో రోజును ముగించండి.

7వ రోజు: అల్పాహారం: రవ్వ ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, టమాటా కూర మధ్యాహ్న భోజనం: టమాటా కూరతో పాటు కొన్ని వడలను వేయించడానికి ప్రయత్నించండి. సగం గిన్నె పెరుగులో కొన్ని దాల్చిన చెక్, కరిగించిన డార్క్ చాక్లెట్‌ని కలిపి సేవించండి. రాత్రి భోజనం: టమాట-ఉల్లిపాయ చట్నీతో కొన్ని మిల్లెట్ పొంగల్ తయారు చేసుకుని తినండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link