Success Story: రూ. 80 అప్పుతో ప్రారంభమైన రూ.1600 కోట్ల సామ్రాజ్యం.. చదువురాని ఏడుగురు మహిళల సక్సెస్ స్టోరీ ఇదే

Tue, 08 Oct 2024-9:06 pm,

Success Story Lizjat Papad: లిజ్జత్ పాపడ్ ఈ పేరు వినని భారతీయ కుటుంబం ఉండదు. ఒకప్పుడు మన సౌతిండియాల అప్పడాలనే నార్తిండియాలో పెద్ద సైజులో ఉండే పాపడ్ అంటారు. ప్రస్తుతం లిజ్జత్ పాపడ్ సంస్థ  ఒక మల్టీ మిలియన్ డాలర్ల వెంచర్ గా సంస్థగా ఎదిగింది.  

ఏడాదికి రూ.1600 కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీగా ఎదిగింది. 2021లో విడుదల చేసిన డేటా ప్రకారం, లిజ్జత్ పాపడ్ భారతదేశం అంతటా 45,000 మంది మహిళలను నియమించింది, వీరు ప్రతిరోజూ 48 లక్షల పాపడ్‌లను తయారు చేస్తున్నారు. ఒకప్పుడు రూ.80 అప్పుతో ఏడుగురు మహిళలు కలిసి ప్రారంభించిన ఈ సంస్థ ప్రారంభంలో రోజుకు 4 ప్యాకెట్ల పాపడ్లను మాత్రమే తయారు చేసేది.   

అది 1959వ సంవత్సరం. ముంబైలోని గిర్గామ్‌లో నివసిస్తున్న ఏడుగురు గుజరాతీ గృహిణులు తమ సొంత వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. జస్వంతిబెన్ జమ్నాదాస్ పోపట్, పార్వతీబెన్ రాందాస్ తోడనీ, ఉజంబెన్ నారందదాస్ కుండలియా, బానుబెన్ ఎన్ తన్నా, లగుబెన్ అమృతలాల్ గోకాని, జయబెన్ వి విఠలనీ, దివాలిబెన్ లుక్కా తమ వ్యాపారం కోసం ఛగన్‌లాల్ కరంసీ పరే అనే సామాజిక కార్యకర్త నుండి రూ.80 అప్పుగా తీసుకున్నారు.  

తమ వంట నైపుణ్యాలను ఉపయోగించి ఈ 7గురు మహిళలు పాపడ్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు.  మార్చి 15, 1959న, ముంబైలోని రద్దీగా ఉండే ప్రాంతంలోని పాత భవనం టెర్రస్‌పై ఏడుగురు మహిళలు సమావేశమై నాలుగు పాపడ్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఒక్క ఏడాదిలో రూ.6వేల విలువైన ప్యాకేట్లు విక్రయించాడు. 1962లో తమ అప్పడాలకు  లిజ్జత్ పాపడ అని బ్రాండ్ నేమ్ పేరు పెట్టారు.

క్రమంగా మహిళల సంఖ్య పదుల సంఖ్య నుంచి వందల నుంచి వేలకు పెరిగింది. 2021 నాటికి, లిజ్జత్‌తో పనిచేసే మహిళల సంఖ్య 45,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం లిజ్జత్‌కు దేశవ్యాప్తంగా 82 శాఖలు ఉన్నాయి.   

అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లోనూ లిజ్జత్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇప్పుడు లిజ్జత్ పాపడ్ కాకుండా, ఇది ఖఖ్రా, బేకరీ ఉత్పత్తులు, అనేక రకాల మసాలా దినుసులను కూడా ఉత్పత్తి చేస్తుంది. లిజ్జత్‌లో పనిచేసే పురుషులను డ్రైవర్లు, షాప్ అసిస్టెంట్లు, సహాయకులుగా మాత్రమే నియమిస్తారు.   

నవంబర్ 2021లో, లిజ్జత్ పాపడ్ ఎంటర్‌ప్రైజెస్ సహ వ్యవస్థాపకుడు జస్వంతిబెన్ జమ్నాదాస్ పోపట్, 90 ఏళ్ల వయస్సులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుతో అందుకున్నారు.  

 2005లో అప్పటి దేశ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లిజ్జత్‌ను బ్రాండ్ ఈక్విటీ అవార్డుతో సత్కరించారు. 2003లో లిజ్జత్ దేశంలోనే అత్యుత్తమ కుటీర పరిశ్రమ అవార్డును అందుకుంది. 2002లో, ఎకనామిక్ టైమ్స్ ఆమెను బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link