Big Gift for Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఇకపై వేతన సంఘం స్థానంలో కొత్త విధానం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా దీనిపై చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయం విధానాలపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంటుంది. ఇప్పుడున్న 7వ వేతన సంఘం 2026 వరకు అమల్లో ఉంటుంది. అయితే ఇకపై వేతన సంఘం స్థానంలో కొత్త విధానం అమలు చేసే ఆలోచన ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతం పెంపు ఆధారంగా కనీస వేతనం అనేది నిర్ణయిస్తున్నారు. ఇప్పుడీ పద్ధతి మారవచ్చు. కొత్త ఫార్ములాతో జీతభత్యాల్లో గణనీయమైన మార్పులు రావచ్చని తెలుస్తోంది.
కొత్త ఫార్ములా ఆధారంగా ప్రభుత్వం వేతన సవరణ, కనీస వేతనం పరిగణించనుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఉన్నట్టే అప్రైజల్ విధానం కోసం యోచిస్తోంది. అంటే పని తీరు ఆధారంగా జీత భత్యాల ఉండవచ్చు.
2016లో ప్రారంభమైన 7వ వేతన సంఘం 2026 వరకు ఉంటుంది. ఈసారి కొత్తగా 8వ వేతన సంఘం అమలు చేయకుండా కొత్త ఫార్ములా ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ ఫార్ములాతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా లబ్ది పొందవచ్చు.
కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే వేతన సంఘం జీతభత్యాలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. గ్రేడ్ పే ప్రకారం ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగుల్లో 14 పే గ్రేడ్స్ ఉన్నాయి.