7th Pay Commission Latest News: రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త, నైట్ డ్యూటీ అలవెన్స్‌పై కీలక నిర్ణయం
అదే సమయంలో 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు తరువాత, నైట్ డ్యూటీ అలవెన్స్ పొందిన వారి నుండి రికవరీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఉద్యోగుల నుంచి రికవరీని ఆపడానికి, మరియు వివిద పరిస్థితులలో పనిచేసే కార్మికుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నైట్ డ్యూటీ అలవెన్స్ అందించడానికి రైల్వే విభాగం సిబ్బంది మరియు శిక్షణ శాఖ(DOPT)కి ఓ లేఖ రాసింది.
Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ను ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోండి
ప్రస్తుతం రైల్వే నైట్ డ్యూటీ అలవెన్స్ రికవరీని నిలిపివేసినట్లు ఉత్తర రైల్వే డివిజన్ ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అనుప్ శర్మ తెలిపారు. రైల్వే యూనియన్లు నైట్ డ్యూటీ అలవెన్స్ సమస్యను కొన్ని రోజుల కిందట రైల్వే మంత్రిత్వ శాఖతో లేవనెత్తాయి. ఒక కార్మికుడికి నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వకపోతే అతన్ని / ఆమెను రాత్రివేళ విధులు నిర్వహించడానికి పిలవకూడదని డిమాండ్ చేశారు.
Also Read: BSNL Alert: నాలుగు రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేసిన బీఎస్ఎన్ఎల్, మరో కొత్త ప్లాన్
రైల్వే ఉద్యోగులకు నైట్ డ్యూటీ భత్యం (Night Duty Allowance) లెక్కించడానికి నిబంధనలలో కొన్ని మార్పులు చేశారు. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. నైట్ డ్యూటీ అలవెన్స్ లెక్కించడానికి ఒక ఫార్ములా తయారు చేశారు. [(మూల వేతనం + డీఏ / 200] ఫార్ములా ఆధారంగా నైట్ డ్యూటీ అలవెన్స్ అందించనున్నారు. ఈ ఫార్ములా అన్ని ప్రభుత్వ విభాగాలు మరియు మంత్రిత్వ శాఖలకు వర్తిస్తుంది.
Also Read: ITR Refund Status: మీ ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకున్నారా, సులువైన విధానం మీకోసం
నైట్ డ్యూటీ అలవెన్స్ లెక్కింపు కూడా ఉద్యోగులందరికీ వారి ప్రాథమిక వేతనం ఆధారంగా నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు, గ్రేడ్ ఎ ఉద్యోగులందరికీ ఒకే నైట్ డ్యూటీ అలవెన్స్ ఇచ్చారు. ఇకనుంచి ఈ భత్యంలో కొంత మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఉద్యోగి సూపర్‌వైజర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగులు నైట్ డ్యూటీ చేసిన రోజులు లెక్కిస్తారు. ఒక ఉద్యోగి రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు పనిచేసినప్పుడే నైట్ డ్యూటీ అలవెన్స్ అందుకునేందుకు అర్హులుగా పరిగణిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook