BSNL Alert: నాలుగు రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేసిన బీఎస్ఎన్ఎల్, మరో కొత్త ప్లాన్

BSNL Latest News : బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొన్ని మార్పులు చేసింది. అతి తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లతో పాటు అధిక ధర ఉన్న రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. రూ .47 రీఛార్జ్ కూపన్, రూ .109 ప్లాన్ వోచర్, మరియు రూ .998 స్పెషల్ టారిఫ్ వోచర్, రూ .1098 రీఛార్జ్ ప్లాన్లు నిలిపివేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 4, 2021, 05:12 PM IST
  • బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొన్ని మార్పులు చేసింది
  • 197 ప్రీపెయిడ్ ప్లాన్‌తో సహా కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది
  • బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్ 180 రోజుల చెల్లుబాటు అవుతుంది
BSNL Alert: నాలుగు రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేసిన బీఎస్ఎన్ఎల్, మరో కొత్త ప్లాన్

BSNL Alert: ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొన్ని మార్పులు చేసింది. అతి తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లతో పాటు అధిక ధర ఉన్న రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. రూ .47 రీఛార్జ్ కూపన్, రూ .109 ప్లాన్ వోచర్, మరియు రూ .998 స్పెషల్ టారిఫ్ వోచర్, రూ .1098 రీఛార్జ్ ప్లాన్లు ఇకనుంచి అందుబాటులో ఉండవని వినియోగదారులకు తెలిపింది.

పైన తెలిపిన ప్లాన్‌లను ఆపడంతో పాటు, 197 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌తో సహా కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది.  ఇది రోజువారీ 2 జీబీ డేటాను మరియు 18 రోజుల పాటు అపరిమిత కాల్స్ అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ 180 రోజుల చెల్లుబాటు అవుతుంది. బీఎస్ఎన్ఎల్(BSNL) రూ .365 ప్రీపెయిడ్ ప్లాన్‌పై ధర రూ .32 పెంచింది మరియు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ఇకనుంచి 397 రూపాయలకు లభించనుంది. అయితే పాత ప్రీపెయిడ్‌లో ఉన్న ప్లాన్ ఆఫర్లే దీనికి కూడా వర్తిస్తాయి.

Also Read: Income Tax Refund Alert: ఆదాయపు పన్ను రిఫండ్ అలర్ట్, మీ కోసం CBDT కీలక ప్రకటన
 
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులకు 60 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ అందిస్తుంది. 100 ఎస్ఎంఎస్ మరియు ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. BSNL అందిస్తున్న రూ.249 రీఛార్జ్ ప్లాన్ ఇతర ఏ నెట్‌వర్క్‌లోని వినియోగదారులకు అయినా అపరిమిత వాయిస్ కాల్స్(BSNL Offers) అందిస్తుంది. మరియు ప్రతిరోజూ 1GB వరకు అపరిమిత డేటాను అందిస్తుంది. ఆ తరువాత ఈ ఇంటర్నెట్ వేగం 40 Kbpsకి తగ్గుతుంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ  60 రోజులు.

Also Read: Gold Price Today 04 April 2021: మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు

బీఎస్ఎన్ఎల్ రూ .298 యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వినియోగదారులకు అవే ఆఫర్లు అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఈరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News