ITR Refund Status Online: పన్నులు వసూలు చేయడం, పన్ను ఎగ్గొట్టిన వారికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిమానాలు విధించడం చేస్తుంటారు. అయితే ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 22, 2021 తేదీల మధ్య మొత్తం రూ.2,13,823 కోట్ల రూపాయాలను ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్(ITR) విడుదల చేసింది. తద్వారా 2.24 కోట్ల మంది దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు తమ రిఫండ్ వివరాలను ఆన్‌లైన్ ద్వారా సులువుగా స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ 2021 మీరు ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. tin.tin.nsdl.com డైరెక్ట్ లింక్ ద్వారా వెబ్‌సైట్‌కు వెళ్లి ఐటీఆర్(ITR Rules) రిఫండ్ స్టేటస్ వివరాలు తనిఖీ చేసుకోండి. పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN) నెంబర్, అసెస్‌మెంట్ 2021, క్యాప్చా వివరాలు నమోదు చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆదాయపు పన్ను చెల్లింపుదారుడి ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ వివరాలు మీకు కనిపిస్తాయి.
Also Read: Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్, తొలి రోజు నుంచే సేవలకు అంతరాయం
ITR Refund Status Check: ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ కింది విధంగా చెక్ చేసుకోండి
1) మొదటగా tin.tin.nsdl.com వెబ్‌సైట్ లేదా డైరెక్ట్ లింక్ tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. (bit.ly/2YgCyk3)
2) మీ PAN కార్డ్ వివరాలు నమోదు చేయాలి
3) అసెస్‌మెంట్ ఇయర్ 2020-21 సెలక్ట్ చేసుకోవాలి
4) అసెస్‌మెంట్ ఇయర్ కింద ఉన్న క్యాప్చా కోడ్ నమోదు చేయాలి
5) కింది వైపు ఉన్న ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి
6) ఆ తరువాత ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి
Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం
గత ఆర్థిక సంవత్సరానికిగానూ పన్నులలో రూ.213,823 కోట్లను ఐటీఆర్ రిఫండ్‌గా అందిస్తున్నట్లు సబీడీటీ స్పష్టం చేసింది. దీని ద్వారా 2.24 కోట్లకు పైగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఎవరెవరికీ ఎంత ఐటీఆర్ రిఫండ్ వచ్చిందో తెలుసుకునేందుకు పైన పేర్కొన్న విధానాన్ని పాటించాలి. అధికారిక వెబ్‌సైట్‌లో స్టేటస్ వివరాలు తెలుసుకుని ఏమైనా సందేహాలుంటే ఫిర్యాదు చేసుకునే వీలు దొరుకుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook