7th Pay Commission: 5 ఏళ్ల అరియర్‌తో కలిపి డియర్‌నెస్ అలవెన్స్ 13 శాతం వరకు పెరగవచ్చు, Holiకి ముందే ఉద్యోగులకు DA Hike

Sun, 21 Feb 2021-2:25 pm,

మా భాగస్వామి సైట్ జీ న్యూస్ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 13 శాతం పెంచే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ దీనిపై కసరత్తు ప్రారంభించింది.

7వ వేతన సంఘం(7th Pay Commission) బకాయిల్లో 75 శాతం బకాయిలను ప్రభుత్వం ఉద్యోగులకు అందించనుంది. గతేడాది ప్రభుత్వం 25 శాతం బకాయిలు చెల్లించింది. బకాయి మొత్తం 3 విడతలుగా ఇవ్వనున్నారు. మొదటి రెండు విడతలు విడుదలయ్యాయి.

ఏజీ ఆఫీస్ బ్రదర్‌‌మహుడ్ మాజీ అధ్యక్షుడు మరియు సిటిజెన్స్ బ్రదర్హుడ్ అధ్యక్షుడు హరిశంకర్ తివారీ 'జీ బిజినెస్' డిజిటల్‌తో మాట్లాడుతూ.. జూన్ 2021 నాటికి డీఏ మరో 3-4 శాతం పెరుగుతుందని చెప్పారు. డీఏను 30-32 శాతానికి పెంచుతుంది. అయితే ప్రస్తుతం డీఏ చెల్లింపు 17 శాతం వరకు చెల్లించనున్నారు.

హరిశంకర్ తివారీ ప్రకారం, జూన్ 2021 నాటికి ఓవరాల్‌గా DA 30 నుండి 32 శాతానికి పెరుగుతుంది. ఇది కేంద్ర ఉద్యోగుల డీఏ చెల్లింపుల్లో సుమారు 15 శాతం పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు కేంద్ర ప్రభుత్వం దీనిని సవరించుకుంటుందని తెలిసిందే. బేసిక్ పే(Basic Pay)ను ఆధారంగా తీసుకుని దీన్ని లెక్కిస్తారు.

కరోనా మహమ్మారి కారణంగా జనవరి 1, 2020 నుండి జూలై 1, 2021 వరకు DA పెంపును ప్రభుత్వం కొంతకాలం నిలిపివేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ .37000 కోట్లు వరకు ఆదా చేస్తుంది.

జనవరి 1, 2020 నుండి 30 జూన్ 2021 వరకు బకాయిలు చెల్లించే అవకాశాలు కనిపించడం లేదని స్పష్టమైంది. జూలై 2021లో, డీఏ (DA), డీఆర్‌ (DR)లకు సంబంధించిన నిర్ణయం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ ఉద్యోగుల DAను తాత్కాలికంగా నిలిపివేశాయి. హరిశంకర్ తివారీ మాట్లాడుతూ.. గతంలో కూడా Dearness Allowance అత్యవసర పరిస్థితుల్లో నిలిపివేశారని గుర్తుచేశారు. 1975లో అత్యయిక సమయంలో కొన్ని భత్యాలు నిలిపివేశారు. కాని కొంత కాలం తరువాత ఉద్యోగులకు ఆ మొత్తాన్ని తిరిగి అందించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link